ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వివిధ దేశాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 66,07,000మందికి కరోనా సోకింది. మృతుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. అయితే కొవిడ్-19 నుంచి సుమారు 32లక్షల మంది కోలుకున్నారు.
అమెరికాలో కొత్తగా 2,085 పాజిటివ్ కేసులు నిర్ధరణకాగా, మొత్తం కేసుల సంఖ్య 19లక్షలకుపైగా పెరిగింది. మృతుల సంఖ్య లక్షా 9వేలు దాటింది. బ్రెజిల్లో కొత్తగా 3,037 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5లక్షల 87వేలు దాటింది. మొత్తం 32వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్లో మరో 4,800లకుపైగా కేసులు నమోదయ్యాయి.