ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా లక్షా 92 వేలు దాటిన కరోనా మృతులు

author img

By

Published : Apr 24, 2020, 8:09 PM IST

ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటివరకు 1,92,000 మందికి పైగా వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. 27 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. వైరస్ మృతుల్లో మూడింట రెండొంతుల మంది ఐరోపాలోనే ఉన్నారు. అమెరికాపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.

corona toll overall world
ప్రపంచంపై కరోనా పంజా.. లక్షా తొంభై రెండువేలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు లక్షా 92 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో మూడింట రెండొంతుల మంది ఐరోపాలోనే కన్నుమూశారు. ఐరోపాలో మృతుల సంఖ్య 1,16,220కి చేరగా... 12,96,248 కేసులు నమోదయ్యాయి.

corona toll overall world
ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు

అమెరికాపై తీవ్ర ప్రభావం

అమెరికాలో ఇప్పటివరకు 8,87,826 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. 15 వేలమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

పాక్​లో 11వేల కేసులు..

పాకిస్థాన్​లో వైరస్ కేసులు 11,155కు పెరిగాయి. అయితే 79 శాతం కేసులు స్థానికంగా వ్యాప్తి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు అక్కడ 237 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 2,520 మందికి పైగా వైరస్ నయమైంది.

'ఇరాన్​ ఇక రెడ్ జోన్​ కాదు..'

ఇరాన్ ఇక ఎంతమాత్రమూ కరోనా రెడ్​జోన్ కాదని ప్రకటించింది ఆ దేశం. అయితే ఆంక్షలు అమలు అవుతాయని స్పష్టం చేసింది. తాజాగా 93 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చూడండి: కరోనాపై పోరుకు నాసా 'వైటల్' అస్త్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.