ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పలు దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 3.27 కోట్ల మందికి వైరస్ సోకగా.. 9.93 లక్షల మంది మృత్యువాత పడ్డారు. సుమారు 2.41 కోట్ల మంది కోలుకున్నారు.
- అమెరికాలో కొత్తగా 53 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7.24 లక్షలకు చేరుకోగా.. 2.08 లక్షల మంది వైరస్‌కు బలయ్యారు.
- బ్రెజిల్లో శుక్రవారం 32 వేల కేసులు రాగా.. మొత్త సంఖ్య 4.69 లక్షలకు చేరింది.
- రష్యాలో వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉంది. కొత్తగా 7,212 మందికి వైరస్ సోకింది. మొత్తం సంఖ్య 11.36 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 20 వేలకు దాటింది.
- ఫ్రాన్స్‌లో మళ్లీ వైరస్ ఉద్ధృతి పెరుగుతోంది. శుక్రవారం 15 వేల మందికి సోకినట్లు నిర్ధరించారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా.. 31 వేల మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం 12 వేల మంది వైరస్ బారిన పడగా.. ఇప్పటివరకు 6.91 లక్షల మందికి సోకింది.
దేశం | మొత్తం కేసులు | మరణాలు | కోలుకున్నవారు |
అమెరికా | 72,44,184 | 2,08,440 | 44,80,719 |
బ్రెజిల్ | 46,92,579 | 1,40,709 | 40,40,949 |
రష్యా | 11,36,048 | 20,056 | 9,34,146 |
కొలంబియా | 7,98,317 | 25,103 | 6,87,477 |
పెరూ | 7,94,584 | 32,037 | 6,50,948 |
స్పెయిన్ | 7,35,198 | 31,232 | - |
మెక్సికో | 7,15,457 | 75,439 | 5,14,760 |
ఇదీ చూడండి: ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం- 22మంది మృతి