ETV Bharat / international

కరోనా విలయం- ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు దాటిన కేసులు - కరోనా మొత్తం కేసులు

corona cases worldwide: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32కోట్లు దాటింది. ఇప్పటివరకు ఈ వైరస్ ధాటికి మరణించిన వారి సంఖ్య 55లక్షల 39వేలకు చేరింది. అమెరికా, ఫ్రాన్స్​లో వైరస్​ ఉద్ధృతి ఆందోళనకర స్థాయిలో ఉంది.

corona cases worldwide
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు
author img

By

Published : Jan 14, 2022, 10:35 AM IST

Updated : Jan 14, 2022, 10:45 AM IST

Corona cases worldwide: కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 31లక్షల 86వేల 254 కేసులు నమోదయ్యాయి. మరో 7,606 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో విశ్వవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 32 కోట్ల 6లక్షల 87వేల 118కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 55లక్షల 38వేల 809కి చేరింది. 26కోట్ల 40లక్షల 17వేల 707మంది వైరస్​ను జయించారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 5కోట్ల 11లక్షల 30వేల 602గా ఉంది.

  • అగ్రరాజ్యం అమెరికాలో క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 8లక్షల 6వేల 493 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 1,969 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8లక్షల 69వేల 212కి చేరగా.. కేసుల సంఖ్య 6కోట్ల 23లక్షల 64వేల 475కి పెరిగింది.
  • అమెరికా తర్వాత ఫ్రాన్స్​లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,05,322 కేసులు బయటపడ్డాయి. మరో 225మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 32లక్షల 40వేల 304కి చేరింది. మృతుల సంఖ్య 1,26,530గా ఉంది.
  • ఇటలీలో కొత్తగా 1,84,615 కేసులు వెలుగు చూశాయి. మరో 316 మంది మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 81లక్షల 55వేల 645కి చేరింది. మృతుల సంఖ్య 1,40,188కి పెరిగింది.
  • స్పెయిన్లో 1,59,161 కొత్త కేసులు, 112 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 79లక్షల30వేల 528గా, మొత్తం మృతుల సంఖ్య 90,620గా ఉంది.
  • అర్జెంటీనాలో కొత్తగా 1,28,402 మందికి వైరస్​ సోకింది. మరో 138మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 67లక్షల 93వేల 119కి చేరగా.. మరణాల సంఖ్య 1,17,808గా ఉంది.
  • జర్మనీ, బ్రెజిల్​, భారత్​లోనూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి: ఆ వ్యాక్సిన్​ మూడో డోసుతో ఒమిక్రాన్​కు చెక్!

Last Updated : Jan 14, 2022, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.