ఆంక్షల సడలింపుల తరువాత ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మొత్తం కొవిడ్ కేసులు కోటీ 12 లక్షలకు చేరువకాగా, మృతుల సంఖ్య 5 లక్షల 29 వేలు దాటింది.
కరోనా ధాటికి అమెరికా అతలాకుతలం అవుతోంది. కొత్తగా అక్కడ 54 వేలకుపైగా కొవిడ్ కేసులు, 616 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 28 లక్షల 90 వేలకు, మరణాల సంఖ్య లక్షా 32 వేలకు పైగా పెరిగింది.
బ్రెజిల్
బ్రెజిల్లో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా అక్కడ 41 వేల 9 వందలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా వేయి 264 మంది మృత్యువాతపడ్డారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షల 43 వేలకు పైగా పెరిగాయి. మరణాల సంఖ్య 63 వేలు దాటింది.
రష్యాలో మరో 6,718 కేసులు నమోదయ్యాయి. 176 మరణాలు సంభవించాయి. మెక్సికోలో గడచిన 24 గంటల్లో 6,740 కేసులు, 654 మరణాలు నమోదయ్యాయి.
ఫ్రాన్స్‌లో..
ఫ్రాన్స్‌లో కొత్తగా 582 వైరస్ కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య లక్షా 66 వేలు దాటగా, మరణాల సంఖ్య 29 వేల 8 వందలు దాటింది.
కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విఫలమయ్యారంటూ కొందరు ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో ప్రత్యేక ఫ్రెంచ్ కోర్డు... కరోనా సంక్షోభాన్ని నివారించడంలో విఫలమైన ముగ్గురు (ప్రస్తుత/మాజీ) మంత్రులపై దర్యాప్తునకు ఆదేశించింది.
వీరిలో మాజీ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్, ఆరోగ్యమంత్రి ఆలివర్ వెరాన్, మరో మంత్రి ఆగ్నెస్ బుజిన్లు ఉన్నారు. వీరిపై ఉన్న అభియోగాలు నిరూపితమైతే... గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
![Corona cases crossing the globe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7884857_worldgraphics_yuga1.jpg)
ఇదీ చూడండి: అతిపెద్ద చంద్రుడి ఫొటోను చిత్రీకరించిన మామ్