ETV Bharat / international

చైనా, ద.కొరియాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 55, 59,350 మందికి పైగా వైరస్​ సోకింది. 3,47, 907 మంది మహమ్మారికి బలయ్యారు. అమెరికా, బ్రెజిల్, రష్యాలు కొవిడ్-19 ధాటికి అతలాకుతలం అవుతున్నాయి.

corona cases world wide
ప్రపంచంపై కరోనా పంజా
author img

By

Published : May 26, 2020, 11:43 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్​, రష్యాల్లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. 55 లక్షల 90 వేల 350మందికి పైగా వైరస్ బారినపడ్డారు. 3,47,900మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో తీవ్రం..

అమెరికాలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ గణాంకాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజులోనే 19,790 మందికి వైరస్ సోకింది. 505 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 55,90,358 మంది వైరస్ బారినపడ్డారు. 3,47,907మంది కరోనాకు బలయ్యారు.

చైనాలో మరో 36మందికి..

చైనాలో మరో 36మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇందులో 29 దొంగ కరోనా కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకినట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం లక్షణాలు లేకుండా కరోనా సోకిన 403మందిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 82,992మందికి వైరస్ సోకింది. 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ మరో 19 కేసులు..

దక్షిణ కొరియాలో కొత్తగా మరో 19మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు అక్కడ 11,225 కేసులు నమోదయ్యాయి. 269మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని సియోల్​లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.

సహచరులపై బ్రెజిల్ అధ్యక్షుడి విమర్శలు..

వైరస్​తో తీవ్రంగా ప్రభావితమవుతున్న బ్రెజిల్​లో అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తీరు మరోసారి వివాదస్పదమయింది. ప్రస్తుత పరిస్థితికి మేయర్లు, గవర్నర్లు, ఆరోగ్య శాఖ మంత్రే కారణమంటూ విమర్శలు చేశారు బోల్సోనారో. కరోనాపై పోరులో తాను సమర్థంగా పోరాడుతున్నట్లు ప్రకటించారు.

సోమవారం ఒక్కరోజు వ్యవధిలో బ్రెజిల్​లో 13,051 మందికి వైరస్ సోకింది. 806మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు అక్కడ 3,76,669 మంది కరోనా బారిన పడగా.. 23,522మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చూడండి: మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.