సమకాలీన అంశాలపై భారత్ చర్చలను రూపొందిస్తుందూనే ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తిని కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా జనవరిలో ఎన్నికయ్యాక జైశంకర్ తొలిసారి అక్కడికి వెళ్లారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం న్యూయార్క్ కు చేరుకుని అటునుంచి భద్రాత మండలికి వెళ్లారు. ఐరాసలో భారత్ తరఫున తమ కృషిని ప్రశంసించినందకు తిరుమూర్తి.. జైశంకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఐరాస సెక్రెటరీ జనరల్ అంటోనియో గుటెరస్‌ను జైశంకర్ కలవనున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తోనూ జైశంకర్ భేటీ కానున్నారు. వీరిద్దరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో అధికార వర్గాలు ఇంకా సమాచారం ఇవ్వలేదు.
అమెరికా సమావేశంలో చర్చించనున్న అంశాలు
- కరోనా సమస్యలు, భారత్లో వాక్సిన్ ఉత్పత్తి వేగవంతం
- టీకా తయారీకి కావల్సిన ముడిసరుకుల రవాణాలో జాప్యం, తదితర సమస్యలను అమెరికా అధ్యక్షుడు జో బెడెన్‌కు తెలియజేయడం
- క్వాడ్ కూటమి గురించి
- పసిఫిక్ ఆసియాలో నెలకొన్న సమస్యల ప్రస్థావన
- భద్రతా సమస్యలు
- ఐటీరంగం, డిజిటల్ భాగస్వామ్యం, విద్యారంగంపై చర్చలు
అయితే కొవిడ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి కరోనాపై పోరాటంలో భారత్‌కు సాయం చేయాలని ప్రభుత్వానికి జోబైడెన్ సూచించారు. భారత్ సహజ మిత్రదేశమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ధన్యవాదాలు