అమెరికా అత్యున్నత నిఘా విభాగమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA), తాలిబన్ల మధ్య రహస్య సమావేశం(CIA secret meeting with Taliban) జరిగింది. తాలిబన్ టాప్ లీడర్ అబ్దుల్ ఘనీ బరాదర్(Abdul Ghani Baradar)తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్(William J. Burns) భేటీ అయ్యారు.
కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం(Washington Post CIA Taliban secret meet) వెల్లడించింది. ఈ విషయాలను అమెరికా అధికారులే వెల్లడించారని తెలిపింది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అమెరికా, తాలిబన్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, ఈ నేపథ్యంలో సమావేశం జరిగిందని వార్తా సంస్థ పేర్కొంది.
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు ఆగస్టు 31 వరకు గడువు ఉండగా.. దీన్ని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. డెడ్లైన్పైనే చర్చ జరిగి ఉండొచ్చని ఓ అధికారి పేర్కొన్నారు.
తాలిబన్ల హెచ్చరిక
అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో.. సైన్యాన్ని ఇంకా దేశంలోనే ఉంచాలని అమెరికాను తన మిత్రదేశాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు ప్రక్రియ కొనసాగించేందుకు బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, డెడ్‌లైన్ తర్వాత కూడా అమెరికా సైన్యం దేశంలోనే ఉంటే.. తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని తాలిబన్లు హెచ్చరించారు.
ఇదీ చదవండి: బైడెన్‌కు తాలిబన్ల హెచ్చరిక- 'రెడ్ లైన్' దాటితే అంతే!