ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ ప్రజలు అందరికంటే ముందుగా క్రిస్మస్ పండగ నిర్వహించుకున్నారు. ఒమిక్రాన్ సహా సాధారణ కరోనా కేసులు కూడా పెద్దగా లేనందున ఆంక్షలు లేకుండానే క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు.
క్రైస్తవుల పవిత్ర స్థలమైన వాటికన్ సిటీలో క్రిస్మస్ ఈవ్ కనుల పండువగా జరిగింది. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిలో శుక్రవారం జరిగిన ప్రార్థనలకు సుమారు రెండు వేల మంది ప్రజలు హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ధర్మోపదేశం చేసిన ఆయన.. ఏసుక్రీస్తు ఓ పేదవాడిగా ప్రపంచంలోకి అడుగుపెట్టాడని గుర్తు చేశారు.
ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు మాస్కులు ధరించి చర్చిలకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో చర్చి నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా ఎఫెక్ట్
కరోనా మహమ్మారి కారణంగా చాలా దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పరిమిత స్థాయిలోనే జరుగుతున్నాయి. అనేక చర్చిలు వేడుకలను రద్దు చేసుకోగా.. మరికొన్ని చర్చిలు కొద్ది మంది భక్తులతో ప్రార్థనలు నిర్వహించాయి.
ఇదీ చదవండి: దేశంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు