పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టైన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఇప్పటికీ భారతీయుడేనని.. పౌరసత్వాన్ని రద్దుచేయాలన్న అతని దరఖాస్తు తిరస్కరణకు గురైందని డొమినికా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో భారత అధికారులు స్పష్టం చేశారు. 1955-పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తప్పుడు సమాచారం అందించాడని వెల్లడించారు.
ఆంటిగ్వా, బార్బుడాల్లో ఛోక్సీ మోసపూరితంగా పౌరసత్వం పొందారని.. అందువల్ల ఇక్కడి ప్రభుత్వాలు అతని పౌరసత్వ రద్దు అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఛోక్సీ భారత్లో చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించి భారతీయ దర్యాప్తు సంస్థలు విచారణ అనుమతి కోరుతున్నట్లు భారత హైకమిషన్ తెలిపింది. ఇప్పటికే ఛోక్సీ బెయిల్ పిటిషన్ను డొమినికా హైకోర్టు తిరస్కరించింది.
ఇవీ చదవండి: ఛోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ