బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రిన్స్ ప్రకటన విడుదల చేశారు.
'25 ఏళ్ల క్రితం పంచెన్ లామా వారసుని ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత చిన్నతనంలోనే పంచెన్లామా అదృశ్యమవడం, అతని స్థానంలో తమ ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తిని పంచెన్లామాగా ప్రకటించేందుకు చైనా ప్రయత్నించడం మతపరమైన స్వేచ్ఛకు విఘాతం కల్గించడమే' అని ప్రకటన తెలిపింది.
ఇదీ చూడండి: 'బాల లామా' కోసం చైనా వేట- రంగంలోకి అమెరికా..!
చైనా జోక్యం లేకుండా దలైలామా వారసుడి ఎంపిక స్వతంత్రంగా జరగాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే బిల్లు తీసుకొచ్చింది అమెరికా. దీని ద్వారా టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ను ఏర్పాటు చేసి అంతార్జాతీయ కూటమిని ప్రతిపాదించింది. 15వ దలైలామా ఎంపికలో జోక్యం చేసుకునే చైనా అధికారులపై ఆంక్షలు విధించేలా విధానాలు రూపొందించింది. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వమూ ఆ విధానాలనే పాటిస్తోంది.
ఇదీ చూడండి: అమెరికా చట్టం- చైనాకు 'టిబెట్' సంకటం