ETV Bharat / international

Joe Biden: 'తాలిబన్లతో చైనాకే సమస్య.. అందుకే ఆ ప్రయత్నాలు' - జో బైడెన్ చైనా

తాలిబన్లతో సంబంధాల కోసం చైనా (China Taliban relationship) పరితపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. వారితో చైనాకే అసలు సమస్య (Taliban threat to China) ఉందన్నారు. అందుకోసమే వారితో పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. రష్యా, పాకిస్థాన్, ఇరాన్​లు సైతం ఇదే ఏర్పాట్లు చేసుకుంటున్నాయన్నారు.

joe biden on china taliban
జో బైడెన్
author img

By

Published : Sep 8, 2021, 8:00 AM IST

తాలిబన్లతో అసలు సమస్య చైనాకే (China Taliban) ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వ్యాఖ్యానించారు. అందుకే పరిష్కారం కోసం వారితో 'ఏర్పాట్లు' చేసుకుంటోందని అన్నారు. చైనా నుంచి తాలిబన్లు (China Taliban support) నిధులు పొందుతున్నారనే అంశంపై విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"తాలిబన్లతో అసలు సమస్య చైనాకే (Taliban threat to China) ఉంది. కాబట్టి వారు దీన్ని పరిష్కరించుకునేందుకు తాలిబన్లతో ఏవో 'ఏర్పాట్లు' చేసుకుంటున్నారు. పాకిస్థాన్, రష్యా, ఇరాన్ మాదిరిగానే.. చైనా ఈ ప్రయత్నాలు చేస్తోంది. వీరంతా ఇప్పుడేం చేయాలా అని ఆలోచించుకుంటున్నారు."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

చైనా ఇప్పటికే అఫ్గాన్​లోని తాలిబన్లతో (China Taliban relationship) సంప్రదింపులు ప్రారంభించింది. తాలిబన్ల పాలన చట్టబద్ధమేనని గుర్తించేందుకు సిద్ధంగా ఉందని అమెరికాలోని వార్తా సంస్థ పేర్కొంది. మానవ హక్కుల ఉల్లంఘన, భావవ్యక్తీకరణపై ఆంక్షల విషయంలో తాలిబన్లు, చైనా ఒకటేనని మీడియా నివేదికలో తెలిపింది. అయితే తాలిబన్లు తీవ్రవాద భావజాలంతో ఉంటే, చైనా సంప్రదాయవాదిగా ఈ పనులు చేస్తోందని వివరించింది. దేశం అభివృద్ధి బాటలో ఉన్నప్పటికీ తన ప్రజలను చైనా బానిసలుగానే చూస్తోందని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: 'తాలిబన్ల ఆక్రమణ.. భారత్‌కు హాని.. పాక్‌కు ప్రయోజనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.