ETV Bharat / international

'కరోనా వేళ మరింత దూకుడు పెంచిన చైనా' - us china war

కరోనా విపత్తును తన ప్రయోజనాల కోసం వాడుకునేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని అమెరికా ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఇతర దేశాలపై బలప్రయోగం చేస్తోందని అమెరికా రక్షణ మంత్రి అన్నారు. ఈ విధంగానే భారత్​తో ఉద్రిక్తతలకు తెరతీసిందని స్పష్టం చేశారు.

Esper
ఎస్పర్
author img

By

Published : Aug 6, 2020, 12:58 PM IST

కరోనా మహమ్మారి సమయంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరించటం ప్రపంచం గమనిస్తోందని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ అన్నారు. ఈ విపత్తును తమ ప్రయోజనాల కోసం చైనా వినియోగిస్తోందని ఆరోపించారు.

"గడిచిన 7 నెలల కరోనా సమయంలో చైనా దూకుడును పెంచటం గమనించాం. ఈ విషాద విషయాన్ని తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వినియోగిస్తోంది. చైనా మితిమీరిన చర్యలకు పాల్పడింది. దక్షిణ చైనా సముద్రంలో తన బలం చూపేందుకు ప్రయత్నించింది."

- మార్క్ ఎస్పర్, అమెరికా రక్షణ మంత్రి

భారత్​తోనూ..

యాస్పెన్​ భద్రత సదస్సులో భాగంగా ఓ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు ఎస్పర్​. భారత్​, చైనా మధ్య ఇటీవల చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎస్పర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"వియత్నాంకు చెందిన ఓ చేపల బోటును కొన్ని నెలల కింద చైనా ముంచేసింది. భారత్​లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను మోహరించి ఉద్రిక్తతలకు కారణమైంది. ఇతరుల చేతులను వంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనలను ఖాతరు చేయటం లేదు. వారి వ్యవహార శైలి ఇలాగే ఉంటే మా మిత్ర దేశాలు కూడా తగినట్లు స్పందిస్తాయి. ఒక బృందంగా ఏర్పడి చైనా వైఖరిని అడ్డుకోవటం మంచి మార్గం."

- మార్క్ ఎస్పర్, అమెరికా రక్షణ మంత్రి

దక్షిణ చైనా సముద్రంలోని 13 లక్షల చదరపు మైళ్ల ప్రాంతం తన అధీనంలో ఉందని చైనా వాదిస్తోంది. బ్రూనై, మలేసియా, ఫిలిప్పీన్స్​, తైవాన్, వియత్నాం తమవని చెబుతోన్న ప్రాంతాల్లో కృత్రిమ దీవులను ఏర్పాటు చేసి స్థావరాలను పెట్టుకుంది.

వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు చేపలు పట్టడం లేదా ఖనిజ అన్వేషణ వంటి వాణిజ్య కార్యకలాపాలకు బీజింగ్ ఆటంకం కలిగిస్తోంది. ఆ ప్రాంతాలు వందల ఏళ్లుగా చైనాకు చెందినవని వాదిస్తోంది.

ఇదీ చూడండి: 'లద్దాఖ్'​పై భారత్​- అమెరికా రక్షణ మంత్రుల చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.