ETV Bharat / international

ట్రక్కుల ఆందోళన ఉద్ధృతం.. అమెరికా-కెనడా సరిహద్దు దిగ్బంధం - అమెరికా కెనడా నిరసనలు

Canada protests: అమెరికా-కెనడా సరిహద్దును నిరసనకారులు దిగ్భంధించారు. టీకా తప్పనిసరి నిబంధనను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.

US  Canada border
అమెరికా- కెనడా మధ్య కి.మీ మేర నిలిచిన వాహనాలు- ఐదు రోజులుగా నిరసనలు
author img

By

Published : Feb 12, 2022, 7:56 AM IST

Updated : Feb 12, 2022, 8:36 AM IST

US canada border: అమెరికా-కెనడా సరిహద్దులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీకా తప్పనిసరి నిబంధనను వ్యతిరేకిస్తూ కెనడాకు చెందిన ట్రక్కు, భారీ వాహనాలు, పికప్​ డ్రైవర్లు ఐదు రోజులుగా నిరసనలు చేయడమే ఇందుకు కారణం. టీకా విధానాన్ని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా-కెనడా మధ్య అత్యంత రద్దీగా ఉండే అంబాసేడర్ వంతెనను దిగ్భంధించారు. దీంతో రెండు దేశాల మద్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఈ బ్రిడ్జి ద్వారా ఇరు దేశాల మధ్య 328 మిలియన్ డాలర్లు విలువ చేసే సరకు రవాణా జరుగుతుంటుంది. ఇది రెండు దేశాల మొత్తం వాణిజ్యంలో 25శాతం కావడం గమనార్హం.

US  Canada border
అమెరికా- కెనడా మధ్య కి.మీ మేర నిలిచిన వాహనాలు

ఇరుదేశాల మధ్య రవాణా స్తంబించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్​ ట్రుడోతో ఫోన్లో మాట్లాడారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని, శాంతి భద్రతలను పునరుద్ధరిస్తాని బైడెన్​కు ట్రుడో హామీ ఇచ్చినట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.

US  Canada border
అంబాసేడర్ వంతెన

మరోవైపు అంబాసేడర్​ వంతెనపై ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని అమెరికా కోర్టు జడ్జి ఆదేశించారు. సరకు రవాణా పునరుద్ధరించాలని సూచించారు. అయితే అధికారులు మాత్రం డ్రైవర్లు పార్క్​ చేసిన ట్రక్కులు, ఇతర వాహనాలను తొలగించేందుకు ఇంకా చర్యలు చేపట్టలేదు.

ఎందుకు నిరసనలు?

US  Canada border
టీకా నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు

కరోనా టీకా రెండు డోసులు వేసుకోకపోతే అమెరికా, కెనడా మధ్య తిరిగే వారు 14 రోజులు తప్పనిసరి క్వారంటైన్​లో ఉండాలని రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయాన్ని ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిన్​ ట్రుడో మాత్రం ఈ విషయంలో వెనక్తి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో అంబాసేడర్ వంతెనపై వాహనాలు నిలిపి రావాణా స్తంభించజేశారు డ్రైవర్లు.

ఇదీ చదవండి: ఇప్పటికీ కిమ్​తో టచ్​లో డొనాల్డ్​ ట్రంప్​!

Last Updated : Feb 12, 2022, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.