ETV Bharat / international

ఆ దేశ ప్రధానికి కరోనా పాజిటివ్- ఐసోలేషన్​ నుంచే.. - కెనడా ప్రధాన మంత్రికి కొవిడ్​ పాజిటివ్​

Canada prime minister tested positive: కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో కరోనా బారిన పడ్డారు. పాజిటివ్​ వచ్చిన విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజులు ఐసోలేషన్​లోకి వెళ్లనున్నట్లు తెలిపారు.

canada-prime-minister-tested-positive
కెనడా ప్రధానికి కరోనా పాజిటివ్
author img

By

Published : Feb 1, 2022, 7:11 AM IST

Canada prime minister tested positive: కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడోకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని తెలిపారు. ఆయన ఐసోలేషన్​లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అలానే పని కూడా ఒంటరిగా ఉండి చేస్తున్నట్లు వివరించారు. వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే దేశ ప్రజలందరూ కచ్చితంగా టీకా పంపిణీ కార్యక్రమంలో భాగం కావాలని కోరారు. అర్హులు ఎవరైనా.. బూస్టర్​ డోసు తీసుకోవాలని సూచించారు.

మంగళ వారం నుంచి మరో ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్​లోకి వెళ్లనున్నట్లు తెలిపారు ట్రూడో. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైరస్​ బారిన పడినట్లు చెప్పారు. తన ముగ్గురు పిల్లల్లో ఒకరికి కరోనా వైరస్​ సోకినట్లు తెలిపారు. గతంలో ట్రూడో భార్యకు పాజిటివ్​ వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక శాతం టీకా రేటు కలిగి ఉన్న దేశంగా కెనడా ఉంది. అయితే ఈ టీకాలు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా టీకాలు సంరక్షిస్తున్నాయి.

కొవిడ్​ ఆంక్షలను తప్పనిసరి చేయడం కారణంగా ఆ దేశ రాజధాని ఒట్టావాలోని పార్లమెంట్​ భవనాన్ని చుట్టుముట్టారు నిరసనకారులు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్​ను స్తంభింపచేశారు.

ఇదీ చూడండి: మిస్​ అమెరికా 'ఆత్మహత్య'- 60 అంతస్తుల భవనం నుంచి దూకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.