గుర్రపు పందేలను ప్రత్యక్షంగా లేదా టీవీల్లో చూసే ఉంటారు. గుర్రాలపై జాకీలు కూర్చొని వాటిని పరిగెత్తిస్తుంటారు. కొన్ని రేసుల్లో మధ్యమధ్యలో కంచెలుంటాయి. వాటిపై గుర్రాలు దూకాల్సి ఉంటుంది. అలా గుర్రాలు కంచెలపై నుంచి దూకుతూ.. పరిగెడుతూ చేసే విన్యాసాలు భలే ఉంటాయి. కానీ, ఎప్పుడైనా మనిషే గుర్రంలా పరిగెత్తడం, కంచెలపై నుంచి దూకడం చూశారా? కెనడాకి చెందిన పదిహేడేళ్ల ఓ అమ్మాయి ఆ విన్యాసం చేసి చూపిస్తోంది. కాళ్లతోపాటు రెండు చేతుల్ని నేలపై ఉంచి గుర్రంలా పరుగెడుతూ.. కంచెలపై నుంచి దూకుతూ వార్తల్లోకెక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కెనడాలోని ఎడ్మోంటన్‌కు చెందిన ఎవా వొగెల్ చిన్ననాటి నుంచే హై జంప్ చేయడం సాధన చేసింది. పదేళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే తన గుర్రం కంచెలపై నుంచి జంప్ చేసే విధానం గమనించిన ఎవా తను కూడా గుర్రంలా జంప్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచించింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. గత మూడేళ్లుగా గుర్రంలాగా జంప్ చేయడం ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం కంచెలపై సునాయాసంగా జంప్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. 'జంపింగ్ లైక్ ఎ హార్స్' వీడియోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తూ అందర్ని ఆకట్టుకుంటోంది. ఆ విన్యాసాలను మీరూ చూసేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: కరోనా దెబ్బతో ట్రంప్ విశ్వసనీయతకే పరీక్ష!