కేవలం 45 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించి ఫలితాన్ని వెల్లడించే సరికొత్త పరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. ఖరీదైన ఉపకరణాలు, రసాయనాలేవీ అవసరం లేకుండా.. తక్కువ ఖర్చులోనే పూర్తవడం దీని మరో విశిష్టత.
ప్రస్తుతం కరోనా వైరస్ నిర్ధరణకు పాలిమరేస్ చైన్ రియాక్షన్(పీసీఆర్) సాంకేతికతలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ పరీక్షల ఫలితాలు వెల్లడవడానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది.
ఇందుకు భిన్నంగా క్రిస్ప్‌ఆర్ జీన్ టార్గెటింగ్ సాంకేతికతను ఉపయోగిస్తూ ‘సార్స్-కొవ్-2 డిటెక్టర్’ అనే పరీక్షను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో 45 నిమిషాల్లోనే ఫలితం వెలువడుతుంది.