అమెరికా రవాణా శాఖ మంత్రిగా పీట్ బుట్టిగీగ్ నియమితులయ్యారు. రవాణా మంత్రిగా ఆయన్ను ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనను సెనేట్ ఆమోదించిన నేపథ్యంలో.. తొలి ట్రాన్స్‌జెండర్ కేబినెట్ మంత్రిగా రికార్డుకెక్కారు. స్వలింగ సంపర్కుడినని బహిరంగంగా ప్రకటించి, కేబినెట్ మంత్రిగా ఎంపికైన ఏకైక వ్యక్తి బుట్టిగీగ్ కావడం విశేషం. ఆయన నామినేషన్‌ను అమెరికా ఎగువసభ 86-13 ఓట్ల తేడాతో ఆమోదించింది.
ఇదివరకు ఇండియానాలోని సౌత్ బెండ్ నగరానికి మేయర్‌గా పనిచేశారు బుట్టిగీగ్. నేవీలోనూ సేవలందించారు. 2020 అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వం కోసం బైడెన్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు. అనంతరం రేసు నుంచి వైదొలిగి.. బైడెన్‌కు మద్దతిచ్చారు.
బుట్టిగీగ్ నామినేషన్‌ను డిసెంబర్లో ఖరారు చేశారు అధ్యక్షుడు బైడెన్. ఆయన అత్యంత తెలివైనవారని అప్పట్లో కొనియాడారు. 1982లో జన్మించిన బట్టిగీగ్.. బైడెన్ కేబినెట్లో ఏకైక మిలేనియల్గానూ నిలవనున్నారు.
1981 నుంచి 1996 మధ్య పుట్టినవారిని మిలేనియల్గా వ్యవహరిస్తారు.
ఇదీ చదవండి: బైడెన్ బృందంలో ట్రాన్స్‌జెండర్‌కు చోటు