బ్రెజిల్‌లోని రియో డిజనీరోలో కార్నివాల్ సందడి మొదలైంది. షెడ్యూల్ ప్రకారం కార్నివాల్ సీజన్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందే వీధుల్లో కార్నివాల్ సంబరాలు మొదలయ్యాయి.
అయితే అధికారికంగా నిర్వహించే వాటికన్నా ఈ వేడుకలు భిన్నంగా ఉంటాయి. భారీ ప్రదర్శనలు, థీమ్ కార్లు, సౌండ్ ఆంప్లిఫయర్లు లేకుండానే వీటిని నిర్వహిస్తారు.
రియో డిజనీరోలో ఏటా జరిగే కార్నివాల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వివిధ నేపథ్యాలతో పరేడ్లు, భిన్నమైన వస్త్రధారణ, సంగీతం, నృత్యాలతో నగర వీధులన్నీ హోరెత్తుతాయి.