ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సహా పలుదేశాలు ప్లాస్టిక్‌పై యుద్ధాన్ని ప్రకటించాయి. పాలిథీన్ వినియోగాన్ని రోజురోజుకు తగ్గించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్థాలు కూడా పెరిగిపోతున్న తరుణంలో బ్రెజిల్లో పలువురు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వ్యర్థాలతో రకరకాల ఆకృతుల్లో బొమ్మలను తయారు చేసి.. వాటిని ప్రత్యేక ఎగ్జిబిషన్లో ఉంచారు నిర్వాహకులు.
కలప వ్యర్థాలతో బ్రెజిల్ మ్యాప్..
సముద్రం, నదులు, ఇతర ప్రాంతాల్లో సేకరించిన 30 రకాల వ్యర్థాలతో బ్రెజిల్ మ్యాప్‌ను తయారు చేసి ప్రదర్శించాడు జూనియర్ క్రజ్ అనే కళాకారుడు. విపరీతంగా పెరిగిపోతున్న వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఈ విధంగా చేసినట్లు వెల్లడించాడు క్రజ్.
నీటివృథాపై అవగాహన
రిక్ బార్బోజా అనే మరో కళాకారుడు జీన్స్‌తో తయారు చేసిన బట్టలను ప్రదర్శించాడు. వీటితో పాటు వాటర్ బాటిళ్లతో ఓ గోడను ఏర్పాటు చేశాడు. జీన్స్ ఉత్పత్తిలో అధిక మొత్తంలో నీరు వృథా అవుతుందని ప్రజలకు తెలపడమే తన ఉద్దేశమని తెలిపాడు.
ప్రతినెలా 1.7 టన్నుల వ్యర్థాల సేకరణ
కామ్‌లర్బ్ అనే కంపెనీకి చెందిన 40 మంది ఉద్యోగులు ప్రతి నెలా 1.7 టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తెలిపింది. ప్లాస్టిక్, గ్లాసులు, పేపర్, ఇతర వస్తువులను సేకరించి రీ సైక్లింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
కేవలం 2శాతం మాత్రమే
ప్రపంచ వ్యాప్తంగా 10.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంటే.. అందులో కేవలం 2 శాతం మాత్రమే రీ సైక్లింగ్ అవుతున్నట్లు ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి