ETV Bharat / international

అమెరికా, బ్రెజిల్​లో కరోనా మరణ మృదంగం

author img

By

Published : Jan 8, 2021, 12:30 PM IST

Updated : Jan 8, 2021, 3:17 PM IST

ప్రపంచంలో కరోనా మరణాలు అధికంగా నమోదైన రెండో దేశంగా బ్రెజిల్​ నిలించింది. బ్రెజిల్​లో కొవిడ్​ ధాటికి బలైనవారి సంఖ్య 2 లక్షలు దాటింది. అయితే.. కరోనా కట్టడికి మరోసారి లాక్​డౌన్​ విధించేది లేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 3.6 లక్షలు దాటింది. వైరస్​ కట్టడి కోసం జపాన్​లో అత్యయిక స్థితిని విధించారు.

brazil recorded highst deaths of corona deaths after america
అమెరికా తర్వాత అక్కడే అత్యధిక కరోనా మరణాలు

కరోనా మరణాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైన దేశంగా బ్రెజిల్ నిలిచింది. బ్రెజిల్‌లో మహమ్మారి ధాటికి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది.

కరోనా మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో.. లాక్‌డౌన్ మాత్రం విధించేది లేదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ దిశగా వెళ్తే దేశంలో ఆందోళనలు చెలరేగుతాయని ఆయన అన్నారు. కరోనా విసిరే దారుణమైన సవాళ్లకు కూడా సిద్ధంగా ఉండాలని ప్రజలకు బోల్స్‌నారో సూచించారు.

రోజువారీ మరణాలు బ్రెజిల్‌లో పెరిగిపోగా.. అంత్యక్రియల్లో పారిశుద్ధ్య కార్మికులు తీరికలేకుండా గడుపుతున్నారు. ఆస్పత్రులు కూడా రోగులతో నిండిపోయాయి. ఐసీయూ వార్డుల్లో ఖాళీలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ చివరి నాటికి బ్రెజిల్ జనాభాలో సగం మందికి టీకా ఇవ్వడం పూర్తవుతుందని.. కరోనా కూడా నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏ టీకాకు కూడా బ్రెజిల్ ఔషధనియంత్రణ సంస్థలు పచ్చజెండా ఊపలేదు.

'క్యాపిటల్​'పై దాడి రోజున భారీగా మరణాలు..

అమెరికాలోని కాలిఫోర్నియా కరోనా ధాటికి అల్లాడుతోంది. కొద్దినెలలుగా వైరస్​ మరణాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ థ్యాంక్స్​ గివింగ్​ వేడుకల వల్ల ఈ వైరస్​ బాధితుల సంఖ్య బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్​ మద్దతుదారులు క్యాపిటల్​ భవనంపై దాడి చేసిన రోజున అక్కడ దాదాపు 3,900 కరోనా మరణాలు నమోదయ్యాయి.

అమెరికాలో ఇప్పటివరకు 3,61,453 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.

జపాన్​లో అత్యయిక స్థితి..

జపాన్​లో కొవిడ్​ విలయం కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఆ దేశంలో​ శుక్రవారం నుంచి అత్యయిక స్థితిని విధించారు. రెస్టారెంట్లు, ఇతర వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని, ఇంటి నుంచి పనిని కొనసాగించాలని జపాన్​ ప్రధాని యోషిహిడే సుగా మరోసారి అభ్యర్థించారు. ఈ ఎమర్జెన్సీ ఫిబ్రవరి 7 వరకు కొనసాగనుందని తెలిపారు.

కొవిడ్​ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేసేందుకు చట్టాల్లో సవరణలు తెచ్చే యోచనలో జపాన్​ ఉన్నట్లు తెలుస్తోంది. అ దేశంలో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 2,60,00కు చేరింది. శుక్రవారం కొత్తగా 7,500 కేసులు నమోదయ్యాయి.

ఆస్ట్రేలియాలో నూతన ప్రయాణ ఆంక్షలు..

కరోనా కొత్త స్ట్రెయిన్​ కలవరం కొనసాగుతున్న వేళ.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిస్బేన్​ నగరంలో మూడు రోజుల పాటు లాక్​ డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ లాక్​డౌన్​ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాంతోపాటుగా నూతన ప్రయాణ నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ మేరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యను 50 శాతానికి తగ్గించనున్నారు. కొవిడ్​ నెగెటివ్​ రిపోర్టు.. సమర్పిస్తేనే దేశంలోకి అనుమతించనున్నారు. ఈ నిబంధనలను ఫిబ్రవరి 15 వరకు కొనసాగించనున్నారు.

ఆస్ట్రేలియాలో శుక్రవారం 24 కొత్త కరోనా స్ట్రెయిన్​ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:అమెరికాలో 3.5లక్షలు దాటిన కరోనా మరణాలు

Last Updated : Jan 8, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.