ETV Bharat / international

బ్రెజిల్‌పై కరోనా పంజా- చేతులెత్తేసిన ఆసుపత్రులు

బ్రెజిల్​లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడి పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. కొత్త కేసులను చేర్చుకోలేమని ఆసుపత్రులు తమ అశక్తతను వ్యక్తం చేశాయి. వైరస్ మృతులతో శ్మశానవాటికలు నిండిపోతున్నా అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తేలిగ్గా తీసుకోవడం కారణంగా బ్రెజిల్ ప్రజానీకం ఆందోళన చెందుతోంది. కరోనా ముదిరితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో బ్రెజిల్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంంది.

brazil
బ్రెజిల్‌పై కరోనా పంజా.. చేతులెత్తేసిన ఆసుపత్రులు
author img

By

Published : Apr 25, 2020, 3:53 PM IST

లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ కొత్త కేసులను చేర్చుకోలేమని దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులు చేతులెత్తేశాయి. దీంతో శవాగారాలు, శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని ఆసుపత్రులు కరోనా పేషంట్లతో నిండిపోయాయి. దీంతో కొత్తవారిని చేర్చుకోలేమని అక్కడి వైద్య సిబ్బంది తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో అధికారికంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నమోదైన అధికారిక కేసుల సంఖ్య 52,995 కాగా, మృతుల సంఖ్య 3600.

తేలిగ్గా తీసుకుంటున్న అధ్యక్షుడు..

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్నా ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తేలిగ్గా తీసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బ్రెజిలియన్లలో అధిక ప్రమాదం ఉన్న వారిని మాత్రమే ఐసోలేట్‌ చేయాలని ఆయన సూచించారు. దీంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెజాన్‌ రాష్ట్రంలోని మానాస్‌ నగరంలో.. ఒక శ్మశానవాటికలో పెద్దఎత్తున గోతులు తవ్వి సామూహిక ఖననాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని చెప్పారు. రోజూ వంద మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు తెలిపారు. మానాస్‌లో శవాలను తరలించే ఓ డ్రైవర్‌ మాట్లాడుతూ.. ఇటీవల తాను నిర్విరామంగా 36 గంటలు పనిచేశానని చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తన యజమాని ఇంకో డ్రైవర్‌ను నియమించుకోవాల్సి వచ్చిందని వివరించారు.

bolsonaro
అధ్యక్షుడు జైర్ బోల్సోనారో

బాధితుల సంఖ్య ఎక్కువే అంటున్న నిపుణులు..

గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3700 కొత్త కేసులు నమోదుకాగా, 400 మంది మరణించారని అధికారులు స్పష్టంచేశారు. శుక్రవారం కూడా ఆ సంఖ్యలు మరింత పెరిగాయని తెలుస్తోంది. బ్రెజిల్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించడంతో అక్కడ వైరస్‌ సోకిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న మరణాలన్నీ గడిచిన రెండు వారాల కేసులని సావో పాలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. ప్రస్తుతం నమోదైన కేసుల కంటే ఇంకా ఎక్కువే ఉంటాయని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు. కాగా, బ్రెజిల్‌లో రోజుకు 6700 పరీక్షలు జరిపే సామర్థ్యముందని ఈ నెల ఆరంభంలో అక్కడి వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ పరిస్థితి చేయిదాటిపోతే రోజుకు 40 వేల పరీక్షలు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. మరోవైపు తమ ల్యాబ్‌ల్లో నిరంతరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, అయినా వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఇంకా పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కెనీ కొలార్స్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ డిసీజ్‌ స్పెషలిస్టు పేర్కొన్నారు.

brazil
సామూహిక ఖననాలు

ఇదీ అక్కడి పరిస్థితి..

రియో నగరానికి చెందిన ఎడినిర్‌ బెస్సా అనే 65 ఏళ్ల మహిళకు ఏప్రిల్‌ 20న వైద్య సదుపాయం అవసరమైంది. రెండు ఆసుపత్రులు ఆమెను చేర్చుకోడానికి నిరాకరించాయి. తర్వాత 40 మైళ్ల దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతిచెందడంతో మృతదేహాన్ని మళ్లీ రోనాల్డో గొజొలా అనే మరో ఆసుపత్రికి పంపారు. అక్కడ తన తల్లి మృతదేహాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె కుమారుడు రొడ్రిగా బెస్సా వాపోయారు. ‘ఆసుపత్రి బేస్‌మెంట్‌లో అనేక మంది మృతదేహాలు చూశా. అందులో కరోనా అనుమానితులవి కూడా ఉన్నాయి. నా తల్లి మృతదేహాన్నీ కరోనా అనుమానిత మృతిగానే ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి’ అని రోడ్రిగ అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ అనుమానిత కేసులన్నీ అధికారిక లెక్కల్లో కలపకపోవడం గమనార్హం. తన తల్లి మృతదేహాన్ని బుధవారం ఖననం చేశామని, అంత్యక్రియలకు చాలా తక్కువ సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారని రోడ్రిగ చెప్పారు. ప్రజలంతా ఈ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని, అది ప్రాణాంతమైందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో గతవారం తన కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించారు. కరోనా నివారణకు ప్రజలను అప్రమత్తం చేసినందుకు తొలగించడం గమనార్హం.

ఇదీ చూడండి: ట్రంప్ చెప్పిన మందు వాడితే ఇబ్బందే: ఎఫ్​డీఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.