ETV Bharat / international

వర్జిన్​ ఆర్బిట్​ కొత్త రాకెట్​ ప్రయోగం విఫలం - undefined

వ్యాపార దిగ్గజం రిచర్డ్​ బ్రాన్సన్​కు చెందిన వర్జిన్​ ఆర్బిన్ ​ కొత్త రాకెట్​ ప్రయోగ పరీక్ష విఫలమైంది. లాస్ ఏంజెలస్​కు ఉత్తరాన ఉన్న ఎడారిలోని మొజావే అంతరిక్షకేంద్రం నుంచి బయలుదేరిన అధునాతనమైన జంబో రాకెట్‌.. ఛానల్ దీవులలో నేలకొరిగినట్లు సంస్థ ట్విట్టర్​ ద్వారా పేర్కొంది.

Branson's Virgin Orbit fails on first rocket launch attempt
వర్జిన్​ ఆర్బిట్​ కొత్త రాకెట్​ ప్రయోగం విఫలం
author img

By

Published : May 26, 2020, 10:21 AM IST

వర్జిన్​ ఆర్బిట్​ కొత్త రాకెట్​ ప్రయోగం విఫలం

ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన.. వర్జిన్ ఆర్బిట్ కొత్త రాకెట్ మొదటి ప్రయోగ పరీక్ష విఫలమైంది. బోయింగ్ 747 ద్వారా దక్షిణ కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రం మీదుగా విడుదల చేసిన కొద్ది సేపటికే రాకెట్ కూలిపోయింది. లాస్ ఏంజెలస్​కు ఉత్తరాన ఉన్న ఎడారిలోని మొజావే అంతరిక్షకేంద్రం నుంచి బయలుదేరిన అధునాతనమైన జంబో రాకెట్‌.. ఛానల్ దీవులలో నేలకొరిగింది. కాస్మిక్ గర్ల్ అని పిలిచే జంబో జెట్ ఎడమవైపు నుంచి రాకెట్ విడిపోయిన కొద్ది సేపటివరకు ప్రయోగం సవ్యంగానే ఉందని.. తరువాత కొద్ది సేపటికే కూలిపోయిందని వర్జిన్ ఆర్బిట్ ట్విట్టర్‌లో పేర్కొంది.

విమానం, విమాన సిబ్బంది క్షేమంగానే ఉన్నట్లు ప్రకటించింది. రాకెట్ తొలి రెండు దశల్లోనే విఫలమైనట్లు భావిస్తున్నారు. రాకెట్‌ కూలిపోవడానికి గల కారణాలు ఇప్పడే చెప్పలేమనీ అధికారులు తెలిపారు. 70అడుగుల పొడవున్న ఈ రాకెట్‌ తయారీ కోసం వర్జిన్‌ సంస్థ పరిశోధకులు ఐదేళ్లు కృషి చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.