బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతేగాకుండా సుమారు 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. మధ్య బొలీవియా ప్రాంతంలోని ఓ లోయలో బస్సు పడి ఈ దుర్ఘటన జరిగింది.
బస్సు సుమారు 200 మీటర్లు ఎత్తు నుంచి పడిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ బస్సు మోరచాటా అనే పట్టణం నుంచి కొచ్చాబాంబకు వెళ్తుండగా ఈ ప్రమాంది జరిగింది.
ఇదీ చూడండి: China BRI 'చైనా చేపట్టిన ఆ ప్రాజెక్ట్‌తో పర్యావరణానికి ప్రమాదం'