అమెరికా అధ్యక్ష్యుడిగా ఎన్నికైన జో బైడెన్ వచ్చే సోమవారం(డిసెంబర్21) కొవిడ్ టీకా వేయించుకోన్నారు. అదే రోజున ఆయన భార్య జిల్ కూడా వాక్సిన్ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని బైడెన్ అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడించారు. డెలావేర్ వైద్య సదుపాయం వద్ద బైడెన్ బహిరంగంగానే టీకా తీసుకుంటారని.. అనంతరం అక్కడి ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతారని జెన్ పేర్కొన్నారు.
అగ్రరాజ్య ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కమలా హారిస్.. ఆమె భర్త డౌగ్ ఎమోఫ్ రానున్న వారాల్లో టీకా తీసుకోనున్నారు. అయితే ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ , అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్‌కే ఉంది'