ETV Bharat / international

ఒబామా రికార్డును బ్రేక్ చేసిన బైడెన్ - అమెరికా పాపులర్ ఓట్లు

అమెరికా ఎన్నికల చరిత్రలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ సరికొత్త రికార్డును నమోదు చేశారు. అత్యధిక పాపులర్​ ఓట్లను సాధించిన అభ్యర్థిగా నిలిచారు. 2008లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సాధించిన 6.94 కోట్ల రికార్డును బద్దలు కొట్టారు.

BIDEN-OBAMA
బైడెన్
author img

By

Published : Nov 5, 2020, 10:55 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. మరో రికార్డు సాధించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను దాటి అమెరికా చరిత్రలో అత్యధిక పాపులర్ ఓట్లు పొందిన అభ్యర్థిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయనకు 7.07 కోట్ల ఓట్లు లభించాయి.

ట్రంప్ కూడా..

2008 ఎన్నికల్లో ఒబామా సాధించిన 6.94 కోట్ల పాపులర్​ ఓట్లు అత్యధికం కాగా.. తాజాగా బైడెన్​ను ఈ రికార్డు బద్దలు కొట్టారు. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒబామా రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు 6.73 కోట్ల పాపులర్ ఓట్లు ట్రంప్​కు లభించాయి.

వందేళ్లలోనే ఈసారి అత్యధిక పోలింగ్‌ నమోదైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో బైడెన్​కు మరిన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

బైడెన్ ఆధిక్యం..

ఉత్కంఠగా సాగుతోన్న అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపులో జో బైడెన్‌ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. అమెరికా మీడియా ప్రకారం, బైడెన్‌కు ఇప్పటికే 264 ఎలక్టోరల్‌ ఓట్లు లభించగా అధ్యక్షుడు ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇదీ చూడండి: ఉత్కంఠగానే అమెరికా ఉభయ సభల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.