అమెరికాకు అత్యుత్తమమైన నాయకత్వం వహించే విధంగా జో బైడెన్ వ్యవహరిస్తారని కమలా హారిస్ అన్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకుల్లో బైడెన్ నంబర్ వన్‌గా నిలుస్తారని కితాబిచ్చారు. అందుకే ప్రపంచమంతా ఆయన్ను గౌరవిస్తోందన్నారు. ఈ మేరకు కమలా ఓ ట్వీట్ చేశారు.
"అగ్రదేశానికి అత్యుత్తమ నాయకుడు బైడెన్. అందుకే ఆయన్ను ప్రపంచం అంతా గౌరవిస్తోంది. భావితరాలు తలెత్తుకునేలా చేస్తారు. అమెరికా సైన్యాన్ని గౌరవించి, ప్రజల ప్రాణాలు కాపాడే కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉంటారు. ఆయన దేశ ప్రజలందరి అధ్యక్షుడు.
-కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్ష విజేత