కాబుల్ పేలుళ్ల ఘటనను(kabul airport blast) అమెరికా తీవ్రంగా పరిగణించింది. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(biden on afghanistan). ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. మృతిచెందిన వారికి సంఘీభావంగా.. బైడెన్ కొద్దిసేపు మౌనం పాటించారు.
" కాబుల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టం. వారిని క్షమించం. వేటాడి మరీ.. ప్రతీకారం తీర్చుకుంటాం."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా.. తన ప్రాణాలను ఫణంగా పెట్టిందన్నారు బైడెన్. తాము ప్రమాదకర మిషన్ను కొనసాగిస్తున్నామన్నారు. బాంబు దాడులు జరిగినా కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ(Kabul evacuation) ఆగదని స్పష్టం చేశారు.
కాబుల్ పేలుళ్ల ఘటనలో కనీసం 72 మంది మృతి చెందారు. వారిలో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
ఇదీ చదవండి: Taliban: 'పాకిస్థాన్ మా రెండో ఇల్లు'- తాలిబన్ల ప్రకటన