ETV Bharat / international

'బీజింగ్ ఒలింపిక్స్​ బహిష్కరణను పరిశీలిస్తున్నాం' - boycott of China Olympics latest news

చైనాలో జరిగే 2022 శీతాకాల ఒలింపిక్స్‌ బహిష్కరణ విషయాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.

Biden
జో బైడెన్
author img

By

Published : Nov 19, 2021, 6:33 AM IST

Updated : Nov 19, 2021, 7:09 AM IST

2022లో చైనాలో జరిగే ఒలింపిక్స్​ను బహిష్కరించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.

చైనా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అందుకే బీజింగ్​ ఒలింపిక్స్​ను అమెరికా బహిష్కరించాలని రిపబ్లికన్​ పార్టీ నేతలు ఇది వరకే ఆ దేశ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

శీతాకాల ఒలింపిక్స్‌ను కమ్యూనిస్ట్ అజెండా ప్రచారానికి డ్రాగన్ వాడుకుంటుందని రిపబ్లికన్ ముఖ్యనేత ఇండో అమెరికన్ నిక్కీ హేలీ గతంలో ఆరోపించారు. వింటర్ ఒలింపిక్స్ మాటున మానవహక్కుల ఉల్లంఘనను చైనా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై.. ఆ దేశంలో మైనారిటీ ముస్లింలుగా ఉన్నా వీఘర్లను చిత్రహింసలకు గురి చేస్తున్న తీరుపైనా.. గతంలో అనేక కథనాలు వచ్చాయి.

ఇదీ చూడండి: యునెస్కో ఎగ్జిక్యూటివ్​ బోర్డుకు మళ్లీ ఎన్నికైన భారత్​

Last Updated : Nov 19, 2021, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.