కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలు, చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 900 బిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించాలని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ను అభ్యర్థించారు జో బైడెన్. ఇది అమెరికన్లను ఆదుకోవాల్సిన సమయమని అభిప్రాయపడ్డారు. 900 బిలియన్ డాలర్ల ఆర్థిక ఉపశమన బిల్లు కోసం ఉభయ సభలు ప్రయత్నాలు చేయడాన్ని స్వాగతించారు.
కరోనా నేపథ్యంలో ప్రజా వైద్య సదుపాయాల కల్పన కోసం కాంగ్రెస్ దృష్టిసారించాలని కోరారు బైడెన్. పరీక్షలు నిర్వహించేందుకు, వ్యాక్సిన్ పంపిణీ కోసం నిధులు అవసరమని అన్నారు. పాఠశాలలు, వ్యాపారాలు పూర్తి స్థాయిలో, సురక్షితంగా పనిచేయాలంటే పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిధులు విడుదలైనప్పుడే.. కొవిడ్‌కు వ్యతిరేకంగా సమర్థంగా పోరాడవచ్చని అభిప్రాయపడ్డారు.