ETV Bharat / international

అమెరికా వాణిజ్య రాయబారిగా చైనా సంతతి వ్యక్తి!

author img

By

Published : Dec 10, 2020, 12:54 PM IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన పాలన బృందం ఏర్పాటు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అమెరికా వాణిజ్య విభాగ రాయబారిగా చైనా-అమెరికన్​ క్యాథరీన్ తాయ్​ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

Biden to nominate Katherine Tai as top trade envoy
బైడెన్ వాణిజ్య రాయబారీగా చైనా అమెరికన్

అమెరికా వాణిజ్య విభాగ రాయబారిగా చైనా అమెరికన్​ క్యాథరీన్​ తాయ్​​ను ఎంపిక చేయాలని ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ట్రేడ్​ కౌన్సిల్​ ముఖ్య అధికారిగా ఉన్న తాయ్​ను.. క్యాబినెట్ స్థానానికి సమానమైన ఈ పదవికి ఎంపిక చేసే అంశాన్ని సెనెట్​లో ఓట్ల ద్వారా నిర్ణయిస్తారు.

చైనా అధికారిక భాష మాండరీన్​ స్పష్టంగా తెలిసిన క్యాథరీన్ తొలుత యూఎస్​ ట్రేడ్ రిప్రజెంటేటివ్​ ఆఫీస్​లోని చైనా ట్రేడ్ ఎన్​ఫోర్స్​మెంట్​ కార్యకలాపాలను పర్యవేక్షించారు. చైనాతో వాణిజ్య యుద్ధ సమయంలో అమెరికా వ్యూహాన్ని రచించారు.

అమెరికా-చైనా మధ్య జనవరిలో జరిగిన వాణిజ్య చర్చలు ఏ నిర్ణయమూ తీసుకోకుండానే ముగిశాయి. చైనా దిగుమతులపై 360 బిలియన్ డాలర్ల సుంకాల విషయం కూడా ఇంకా ఎటూ తేలలేదు. బైడెన్​ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాథరీన్ తాయ్​ను వాణిజ్య రాయబారిగా నియమించే అంశంపై ఆసక్తి నెలకొంది.

పెంటగాన్​కు లాయిడ్ ఆస్టిన్​ నేతృత్వం..

విశ్రాంత ఆర్మీ జనరల్​ లాయిడ్​ ఆస్టిన్​ను రక్షణ విభాగ ముఖ్య అధికారిగా నియమించేందుకు ఉన్న అడ్డంకుల్ని తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు జో బైడెన్. మాజీ సైన్యాధికారి పెంటగాన్​కు నేతృత్వం వహించాలంటే.. పదవీ విరమణ చేసి కనీసం ఏడేళ్లు అయ్యుండాలన్న నిబంధనను తొలగించాలని కాంగ్రెస్​ను కొరారు బైడెన్.

ఇందుకు సెనెట్ ఆమోదం తెలిపితే పెంటగాన్​కు నేతృత్వం వహించే తొలి ఆఫ్రో అమెరికన్​గా ఆస్టిన్​ చరిత్రలో నిలిచిపోనున్నారు.

ఇదీ చూడండి:జో బైడెన్​ కుమారుడిపై ఫెడరల్​ దర్యాప్తు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.