అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు(indian american news) చోటు దక్కింది. అగ్రరాజ్య రక్షణ శాఖ విభాగం పెంటగాన్‌లో(pentagon news) కీలక పదవికి భారతీయ అమెరికన్ మేనేజ్మెంట్ సలహాదారు ఆశిష్ వజిరాణిని నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు బైడెన్.
రక్షణ మంత్రి ఆధ్వర్యంలోని సిబ్బంది, యుద్ధ సన్నద్ధత విభాగం డిప్యూటీగా వజిరాణి నామినేట్ అయినట్లు పెంటగాన్ తెలిపింది. మరోవైపు.. పెంటగాన్‌లో కీలక పదవితో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, మెడిసన్స్ కమిటీల్లో సభ్యులుగా వజిరాణి ఎంపికైనట్లు శ్వేతసౌధం తెలిపింది.
ప్రస్తుతం ఆయన ఏ2ఓ స్ట్రాటజీస్, ఎల్ఎల్సీలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల వరకు నేషనల్ మిలిటరీ ఫ్యామిలీ అసోసియేషన్(ఎన్ఎంఎఫ్ఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓగా చేశారు. అమెరికా నౌకాదళంలో జలాంతర్గామి అధికారిగా 1986 నుంచి 1993 వరకు సేవలందించారు వజిరాణి.
ఇదీ చూడండి: యూఎన్‌జీఏలో బైడెన్ ఐక్యతా రాగం!