ETV Bharat / international

బైడెన్​ తొలి విదేశీ పర్యటన ఖరారు - అమెరికా అధ్యక్షుడు జో బైెడెన్

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటన చేయనున్నారు జో బైడెన్​. జూన్​ 11న బ్రిటన్​లోని కార్న్​వాల్​లో జరగబోయే జీ-7 సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. తర్వాత యూరోప్​లో పర్యటించనున్నారు.

joe biden
జో బైడెన్
author img

By

Published : Apr 23, 2021, 10:58 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తొలి విదేశీ పర్యటన ఖరారైంది. జూన్​ 11-14 మధ్య రెండు దేశాల్లో పర్యటించనున్నారని శ్వేతసౌధం వెల్లడించింది. 11 నుంచి 13 వరకు బ్రిటన్​లోని కార్న్​వాల్​లో జరగబోయే జీ-7 సదస్సుకు ఆయన హాజరు కానున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత జూన్​ 14న యూరోప్​లోని బ్రుస్సెల్స్​లో అమెరికా భాగస్వామ్య కూటమి నాటో దేశాధినేతలతో సమావేశం కానున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా రియాద్, సౌదీ అరెబియాలో పర్యటించారు. అయితే బైడెన్​ మాత్రం.. మిత్రపక్ష దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు .. మొదటి విదేశీ పర్యటనను అగ్రరాజ్య భాగస్వామ్య దేశాల్లోనే చేయనున్నారు.

ఇదీ చదవండి : కొవిడ్​పై పోరులో భారత్​కు సాయం చేస్తాం: చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.