వలసల సమస్యలను పరిష్కరించే బాధ్యతను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించారు. ఆమె అయితేనే ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించగలరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా వలసల సమస్య, చిన్నారుల్ని సరిహద్దులో అదుపులో ఉంచడం బైడెన్ ప్రభుత్వానికి అప్రతిష్ఠను తెచ్చాయని వార్తలు వెలువడ్డాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన బైడెన్.. కమలా హ్యారిస్, ఆరోగ్యశాఖ మంత్రి కేవియర్ బెకెర్రా, హోంమంత్రి అలెజాండ్రో మయోర్కాస్తో సమావేశమయ్యారు.
ఈ భేటీ అనంతరం వలసల సమస్యలను పరిష్కరించే బాధ్యతను కమలా హారిస్‌కు అప్పగిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. అయితే ఇది అంత సులభమైన పని కాదని హ్యారిస్ అన్నారు. అయినా సమస్యను పరిష్కరించేందుకు కష్టపడతానని తెలిపారు.
కాగా టెక్సాస్ సరిహద్దులో భద్రతా బలగాల అదుపులో ఉన్న చిన్నారులను చూసేందుకు వైట్ హౌజ్ అధికారులు, కాంగ్రెస్ సభ్యులు వెళ్లారు.
ఇదీ చదవండి: బైడెన్ సర్కార్‌కు 'వలస' తలనొప్పులు