ETV Bharat / international

అగ్రరాజ్యంలో నవశకం.. అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం - జో బైడెన్​

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేశారు. క్యాపిటల్​లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిరాడంబరంగా.. ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది.

biden takes oath as 46th President of America
అగ్రరాజ్యంలో నవశకం.. అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
author img

By

Published : Jan 20, 2021, 10:20 PM IST

అమెరికా చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్​ క్యాపిటల్ హిల్​కు పశ్చిమం వైపు ఈ కార్యక్రమం​ జరిగింది. ప్రతిసారి వేలాది మంది సమక్షంలో ఘనంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం.. ఈసారి కరోనా, ఇతర భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా సాగింది.

బైబిల్​పై ప్రమాణం..

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12గంటలకు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్​​ రాబర్ట్స్​​.. 78ఏళ్ల బైడెన్​ చేత ప్రమాణస్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127ఏళ్ల బైబిల్​పై ప్రమాణం చేశారు బైడెన్​. ఆ సమయంలో బైబిల్​ను ఆయన భార్య జిల్​ బైడెన్​ పట్టుకున్నారు.

అమెరికన్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ వేడుకను టీవీ ఛానళ్లతో పాటు ట్విట్టర్, ఫేస్​బుక్, యూట్యూబ్​ తదితర సామాజిక మాధ్యమాలు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

అతిథుల సమక్షంలో...

ఈ వేడుకకు మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​, ఆయన సతీమణి హిల్లరి క్లింటన్​, మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా, ఆయన సతీమణి మిషెల్​ ఒబామా హాజరయ్యారు.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీతో పాటు పలువురు చట్టసభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

మాజీ అధ్యక్షుడు ట్రంప్​ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడుగా సేవలందించిన మైక్​ పెన్స్​ కూడా బైడెన్​ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యారు.

అంతకుముందు..

క్యాపిటల్​కు వచ్చే ముందు.. కుంటుంబసభ్యులు సమేతంగా వాషింగ్టన్​లోని చారిత్రక చర్చిని సందర్శించారు బైడెన్​-కమల. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇదీ చూడండి:- బైడెన్​ బృందంలో కీలకంగా భారతీయులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.