ETV Bharat / international

'అమెరికన్ల జోలికి వస్తే ఊరుకోం'- ఇరాన్​కు బైడెన్ వార్నింగ్​

author img

By

Published : Feb 27, 2021, 10:35 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఇరాన్​ను హెచ్చరించారు. అమెరికాకు హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొన్నారు. ఇరాన్​ సరిహద్దులో గురువారం జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల పట్ల బైడెన్​ పార్టీకి చెందిన పలువురు చట్ట సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం.

biden, iran
ఇరాన్​కు బైడెన్​ హెచ్చరిక

సిరియాలో వైమానిక దాడి జరిపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఇరాన్​ను హెచ్చరించారు. మిలీషియా బృందాలకు సహకరిస్తూ అమెరికాకు హాని తలపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. సిరియాపై దాడి అనంతరం ఈ విధంగా స్పందించారు.

ఇరాక్​ - సిరియా సరిహద్దులో గురువారం జరిపిన వైమానిక దాడిపై రక్షణ విభాగం పెంటాగాన్ ప్రతినిధి జాన్​ కిర్​బై​ వివరాలు వెల్లడించారు. ఏడు క్షిపణులతో దాడులు జరిపామని, ఈ క్రమంలో ఇరాన్​ మిటిటెంట్​ బృందాలకు చెందిన 9 స్థావరాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దాడి గురించి చట్టసభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చామన్నారు. అయితే దాడికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.

ఈనెల 15న ఉత్తర ఇరాక్​ లో మిలీషియా బృందం జరిపిన రాకేట్​ దాడిలో ఓ అమెరికా అధికారి గాయపడ్డారు. ఇందుకు ప్రతిచర్యగా అమెరికా వైమానిక దాడి జరిపింది. మిలిటెంట్​ బృందాలకు ఇరాన్​ సాయం అందిస్తోందని అమెరికా భావిస్తోంది.

22 మంది మృతి..

దాడిలో ఒక మిలిటెంట్​ సహా పలువురు గాయపడ్డారని మిలిటెంట్​ వర్గాలు తెలిపాయి. హిజ్బుల్లా బ్రిగ్రేడ్స్ అనే మిలీషియా బృందమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని పేర్కొన్నాయి. అయితే ఈ దాడిలో 22 మంది మిలిటెంట్లు చనిపోయారని బ్రిటన్​కు చెందిన సిరియన్​ మానవ హక్కుల విభాగం వెల్లడించింది.

బైడెన్​ అమెరికాను కాపాడారు..

వైమానిక దాడుల ద్వారా అధ్యక్షుడు బైడెన్​ ఇరాక్​లోని అమెరికన్లను రక్షించారని శ్వేతసౌధం పేర్కొంది. ఈ చర్య ద్వారా అమెరికన్ల రక్షణ కోసం కట్టుబడి ఉన్నాననే సందేశాన్ని అధ్యక్షుడు తెలియజేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇరాన్​తో దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేసింది.

వ్యతిరేకత..

వైమానిక దాడులపై అమెరికా చట్టసభలో మిశ్రమ స్పందన లభించింది. రిపబ్లికన్లు దీనిని సమర్థించగా, బైడెన్ సొంత పార్టీకి చెందిన పలువురు ఈ చర్యను తప్పుపట్టడం గమనార్హం. చట్టసభ ఆమోదం లేకుండా ఇలా దాడులు జరపడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : భారత్​-పాక్​ ప్రకటనపై ఐరాస హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.