ETV Bharat / international

అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక

అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ప్రజలకు నిరుద్యోగ భృతి, బీమా సదుపాయాలు అందనున్నాయి. చిన్న వ్యాపారాలు, అత్యవసర సేవలకు సహాయం చేకూరనుంది.

Biden signs executive orders
అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక
author img

By

Published : Jan 24, 2021, 5:21 AM IST

కరోనా కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారడంతో వారిని ఆదుకోవడానికి వివిధ చర్యలు చేపడుతూ 'అమెరికన్ ఆపద రక్షక ప్రణాళిక'ను రూపొందించారు.

అందులో భాగంగా...

  • ప్రతి నిరుద్యోగికి 2,000 డాలర్లు (రూ.1.40 లక్షలు) ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. ఇప్పటికే 600 డాలర్లు ఇవ్వగా, మిగిలింది వెంటనే అందివ్వనున్నారు.
  • నిరుద్యోగ బీమా కింద ఇస్తున్న సౌకర్యాల కాలపరిమితిని మరికొంతకాలం పాటు పెంచనున్నారు.
  • అద్దెలు చెల్లించలేక చాలా మంది ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తుండడంతో అలా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
  • చిన్న వ్యాపారాలు, అత్యవసర సేవలకు సహాయం అందించనున్నారు.
  • దారిద్ర్య రేఖకు దిగువున లేకుండా చూడడం కోసం ప్రతి వారికి కనీస వేతనం కింద గంటకు 15 డాలర్లు(సుమారు రూ.1,050) చెల్లించాలి. వారానికి 40 గంటలకు మించి పనిచేయాల్సిన అవసరం లేదు.

అంతర్గత తీవ్రవాదంపై సమీక్ష

దేశంలో తలెత్తిన అంతర్గత తీవ్రవాదంపై బెడెన్ వివిధ భద్రత విభాగాలతో సమీక్షించనున్నారు. వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వాలని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంతర్గత భద్రత విభాగాలను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.