ETV Bharat / international

9/11 నాటికి అఫ్గాన్​లో అమెరికా దళాల ఉపసంహరణ

author img

By

Published : Apr 14, 2021, 6:29 AM IST

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా సేనల్ని సెప్టెంబర్​ 11 నాటికి ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. 2001లో సరిగ్గా అదే రోజు న్యూయార్క్​లో వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​పై ఉగ్రవాదులు దాడి చేయటం గమనార్హం.

joe biden
9/11 నాటికి అఫ్గాన్​లో అమెరికా దళాల ఉపసంహరణ

కల్లోలిత అఫ్గా​నిస్థాన్ నుంచి అమెరికా సేనల్ని ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి (9/11) ఉపసంహరించేలా ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మంగళవారం ప్రకటించారు. 2001లో సరిగ్గా అదే రోజు న్యూయార్క్​లో వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​పై అల్​ఖైదా ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసి భారీగా ప్రాణనష్టం కలిగించారు.

ఈ ఇరవై ఏళ్లలో అఫ్గాన్​లో అమెరికా దళాలు అందించిన సేవలు, చేసిన త్యాగాలను బైడెన్​ కొనియాడారు. సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నా దౌత్యపరంగా మద్దతును అఫ్గాన్​కు కొనసాగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి:అఫ్గాన్​లో కారు బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.