ETV Bharat / international

కశ్మీరీల హక్కులను పునరుద్ధరించాలి: బిడెన్​​ - Joe Biden updates

కశ్మీరీల హక్కులను పునరుద్ధరించేలా భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్​. అసోంలో ఎన్​ఆర్సీ అమలు, పౌరసత్వ సవరణ చట్టం అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Biden seeks restoration of peoples' rights in Kashmir; disappointed with CAA, NRC
కశ్మీరీల హక్కులను పునరుద్ధరించాలి: బిడెన్​​
author img

By

Published : Jun 26, 2020, 2:05 PM IST

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమోక్రాట్ల అభ్యర్థి, అగ్రరాజ్యం మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్​.. భారత్​కు సంబంధించిన కీలక అంశాలపై తన అభిప్రాయలు తెలిపారు. కశ్మీరీల హక్కులను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, అసోంలో ఎన్​ఆర్సీ అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ దేశంలోని ముస్లింలకు సంబంధించి తన అజెండాను విధాన పత్రం రూపంలో వెబ్​సైట్లో పోస్ట్ చేశారు బిడెన్. సీఏఏ, ఎన్​ఆర్సీలు భారత్​లోని దీర్ఘకాల లౌకికవాద సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

బిడెన్ వ్యాఖ్యలపై అమెరికాలోని ఓ హిందూ సంఘం అసమ్మతి తెలియజేసింది. భారత్ పట్ల అభిప్రాయాలను పునఃపరిశీలించుకోవాలని బిడెన్​కు సూచించింది. అమెరికాలోని హిందువులకు సంబంధించిన విధాన పత్రాన్ని కూడా విడుదల చేయాలని డిమాండ్​ చేసింది. బిడెన్ ప్రచార వర్గాలు మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాల్లో ఎలాంటి పరిస్థితులున్నాయో వివరిస్తూ అమెరికా ముస్లింల బాధ అర్థం చేసుకున్నానని చెప్పే ప్రయత్నంలో భాగంగానే బిడెన్ ఈ విధాన పత్రాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది. పశ్చిమ చైనాలో 10 లక్షల మంది ఉయ్ఘూర్​ ముస్లింలను నిర్భంధించడం, మయన్మార్​ రోహింగ్య ముస్లింలపై వివక్ష వంటి అంశాలను బిడెన్ ప్రస్తావించారు.

భారత్​లోని పరిస్థితులపై బిడెన్​కు పూర్తి అవగాహన ఉందని ఆయన మద్దతు దారు అజయ్​ జైన్​ బుటోరియా చెప్పారు. అమెరికా సెనేటర్​గా చాలా ఏళ్లపాటు, ఒబామా హయాంలో 8 ఏళ్ల పాటు​ ఉపాధ్యక్షుడిగా బిడెన్​ ఉన్నారని గుర్తు చేశారు. భారతీయులు, భారతీయ-అమెరికన్లతో ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నట్లు వివరించారు.

" సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్​ సరిహద్దు ద్వారా ముష్కరుల చొరబాట్లు, కశ్మీర్​లో హిందూ మైనారిటీలు అనుభవిస్తున్న బాధలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో సమస్య, భారత్-అమెరికా మధ్య బలమైన బంధం, ఆర్థికాభివృద్ధి, తీవ్రవాద నిర్మూలన, మానవహక్కుల పరిరక్షణ, వాతావరణ మార్పు, అంతర్జాతీయ భద్రత వంటి కీలక అంశాల్లో ఇరుదేశాల పాత్రపై బిడెన్​కు పూర్తి అవగాహన ఉంది. భారత్​-అమెరికా మధ్య పౌర అణు ఒప్పందంలో బిడెన్​ కీలక పాత్ర పోషించారు. రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్య విలువ 500 బిలియన్ డాలర్లకు చేరేందుకు సహకరించారు. భారతీయ- అమెరికన్లతో దీపావళి వేడుకలు జరిపేవారు"

-అజయ్​ జైన్​, బిడెన్​ మద్దతుదారు

దేశ ప్రజల ప్రయోజనాల కోసం వలస విధానాల్లో సంస్కరణలు తీసుకురావడం సబబే కానీ, వాటిని అమలు చేసే విషయంలో ఎవరికీ నష్టం కలగకుండా చూసుకోవాలన్నారు అజయ్​ జైన్​. తాను కూడా అసోంలోనే పెరిగినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు స్థానిక ఉద్యోగాలు, వనరులను పొందలేకపోవడం ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చైనాకు సవాల్​: భారత్​కు అమెరికా బలగాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.