మరికొద్ది గంటల్లో తొలి అధ్యక్ష డిబేట్ ప్రారంభంకానున్న తరుణంలో.. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఆయన భార్య జిల్ బిడెన్లు తమ పన్ను రిటర్నుల డేటాను విడుదల చేశారు. 2019లో పన్నుల రూపంలో దాదాపు రూ. 2.21కోట్ల(300,000 డాలర్లు)ను ఇరువురు చెల్లించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 288,000డాలర్లు కేవలం వ్యక్తిగత ఆదాయపు పన్ను అని వెల్లడించారు. పన్ను పరిధిలోకి వచ్చే తన ఆదాయం 944,737డాలర్లు అని బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయపు పన్నుపై న్యూయార్క్ టైమ్స్ ఓ నివేదికను బయటపెట్టిన నేపథ్యంలో బైడెన్ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. 2016, 2017 సంవత్సరాల్లో ఆదాయపు పన్నుగా ట్రంప్ కేవలం 750 డాలర్లు మాత్రమే చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
అయితే ఈ నివేదికను ట్రంప్ ఇప్పటికే ఖండించారు. కానీ తన ఆదాయపు పన్ను వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. మరోవైపు బైడెన్ ఇప్పటికే తన రెండు దశాబ్దాల పన్ను రిటర్నుల వివరాలను విడుదల చేశారు.
ఇదీ చూడండి:- బైడెన్ ప్రచారంపై సొంత పార్టీలోనే కలవరం !