ETV Bharat / international

పుతిన్​కు బైడెన్​ స్ట్రాంగ్​ వార్నింగ్​- అదే జరిగితే..!

author img

By

Published : Dec 31, 2021, 10:28 AM IST

Biden Putin call: రష్యా అధ్యక్షుడు పుతిన్​కు అమెరికా అధ్యక్షుడు బైడెన్​ వార్నింగ్​ ఇచ్చారు. ఉక్రెయిన్​తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాలని లేకపోతే ఆంక్షలతో విరుచుకుపడతామని తేల్చిచెప్పారు బైడెన్​. అదే జరిగితే ఇరు దేశాల బంధం బలహీనపడుతుందని పుతిన్​ స్పష్టం చేశారు. వీరి మధ్య దాదాపు గంట పాటు జరిగిన ఫోన్​ సంభాషణపై రెండు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి.

Biden Putin call
పుతిన్​కు బైడెన్​ వార్నింగ్​- అదే జరిగితే..

Biden Putin talks: అమెరికా- రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్​ వ్యవహారంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో సంభాషణ జరిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. ఉక్రెయిన్​పై సైనికపరమైన చర్యలు చేపడితే, మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఇదే జరిగితే అమెరికా- రష్యా మధ్య మైత్రి మరింత బలహీనపడుతుందని పుతిన్​ హెచ్చరించారు.

ఉక్రెయిన్​- రష్యా మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. తాజాగా రష్యా భారీ ఎత్తున బలగాలను మోహరించడం వల్ల సరిహద్దు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా- రష్యా దేశాధినేతల ఫోన్​ సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది.

US Russia relations: అమెరికా- రష్యాల మధ్య ఇప్పుడు రెండు దారులు ఉన్నట్టు, ఒకటి దౌత్యపరమైన మార్గమని, మరొకటి ఆంక్షలతో విరుచుకుపడటమని పుతిన్​కు బైడెన్​ తేల్చిచెప్పారు. 'ఉక్రెయిన్​లో ఉద్రిక్తతలు తగ్గించాలని పుతిన్​ను బైడెన్​ కోరారు. అలా కాకుండా ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర చేస్తే.. మిత్ర దేశాలతో కలిసి అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.' అని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్​ సాకి తెలిపారు.

"అమెరికా మరిన్ని ఆంక్షలు విధిస్తే.. అది పెద్ద తప్పే అవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్​కు పుతిన్​ తేల్చిచెప్పారు," అని రష్యా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉషకోవ్​ తెలిపారు.

బైడెన్​- పుతిన్​ మాట్లాడుకోవడం.. డిసెంబర్​లో ఇది రెండోసారి. మరోవైపు ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు.. జనవరి 9న జెనీవాలో భేటీకానున్నారు. 12వ తేదీన రష్యా-నాటో సమావేశం జరగనుంది. వియన్నా వేదికగా.. జనవరి 13న ఆర్గనైజేషన్​ ఫర్​ సెక్యూరిటీ అండ్​ కొ-ఆపరేషన్​ ఇన్​ యూరప్​ భేటీ జరగనుంది. ఆయా భేటీల్లో పాల్గొననున్న రష్యా.. ఉక్రెయిన్​ను నాటోలో చేర్చుకోవద్దన్న తన డిమాండ్​ను బలంగా వినిపించే అవకాశముంది.

ఇదీ చూడండి:- 'ఆ దేశంపై సైనిక చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.