ETV Bharat / international

పెద్దన్న పాత్ర కోసం బైడెన్ 'పేటెంట్' అస్త్రం!

కరోనా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసే ఉద్దేశంతో భారత్ చేసిన 'ట్రిప్స్ నిబంధనల మాఫీ' ప్రతిపాదనను అమెరికా ఆమోదించడం వెనక జో బైడెన్ వ్యూహం దాగుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాను ప్రపంచ పెద్దన్నగా మళ్లీ నిలబెట్టాలన్న తలంపుతోనే అధ్యక్షుడు జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

biden
బైడెన్
author img

By

Published : May 8, 2021, 11:51 AM IST

Updated : May 8, 2021, 11:58 AM IST

'టీకాలపై మేధో సంపత్తి హక్కులను రద్దు చేసిన అమెరికా..' ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది చర్చనీయాంశమైనవి విషయం. అయితే టీకా ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడదు. అదే సమయంలో ఈ నిర్ణయంతో అగ్రరాజ్యంలోని ఫార్మా సంస్థలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అయితే అధ్యక్షుడు జో బైడెన్​ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ పెద్ద కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాను తిరిగి 'పెద్దన్న పాత్ర'లో నిలబెట్టడానికి అధ్యక్షుడు బైడెన్​ ఈ పేటెంట్​ అస్త్రాన్ని ప్రయోగించినట్టు నిపుణులు భావిస్తున్నారు.

పెద్దన్న పాత్ర కోసం...!

'ప్రపంచ దేశాలపై అమెరికాది పెద్దన్న పాత్ర...' ఈ మాట విని చాలా ఏళ్లే గడిచిపోయింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 'అమెరికా ఫస్ట్​' నినాదం పుణ్యమా అని.. పెద్దన్న పాత్రకు అగ్రరాజ్యం దూరంగా జరిగిపోయింది. అయితే తాను అధికారంలోకి వచ్చిన అనంతం తిరిగి ఆ హోదాలో నిలబెడతానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​ హామీనిచ్చారు. బైడెన్​ ఇప్పుడు ఆ విధంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు ఆయన ఎంచుకున్న అస్త్రం 'పేటెంట్​ రద్దు'!

దక్షిణాఫ్రికా, భారత్ కలిసి ప్రపంచ వర్తక సంస్థ(డబ్ల్యూటీఓ) వద్ద చేసిన ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి బైడెన్ సర్కారుకు నెలకుపైగా సమయం పట్టింది. ఈ కాలంలో.. అమెరికా ప్రాబల్యాన్ని పునరుద్ధరిస్తూ కరోనాను ఎలా అదుపులోకి తీసుకురావాలనే విషయంపైనే శ్వేతసౌధంలో ప్రధానంగా చర్చ జరిగింది. చివరకు ప్రతిపాదనకు మద్దతుగా నిర్ణయం వెలువరించింది బైడెన్ సర్కార్. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, దేశంలోని ఉదారవాదుల నుంచి విశేష స్పందన లభించింది. సామాజిక కార్యకర్తలు.. బైడెన్​ను ప్రశంసల వర్షంతో ముంచెత్తుతున్నారు. బైడెన్​ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి: 'మేథో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!

ఏడాది తర్వాతే ఫలితం!

అధికారులకు ఉన్న సమాచారం ప్రకారం.. ట్రిప్స్ నిబంధనల మార్పు ఫలితాలు రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే. ఇక ఫైజర్, మోడెర్నా టీకాలను తయారు చేయాలంటే అంతకన్నా ఎక్కువ సమయమే పడుతుంది.

ప్రతిపాదన గట్టెక్కేనా?

మరోవైపు, అమెరికా మిత్రపక్షాలైన పలు ఐరోపా దేశాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. జర్మనీ ఛాన్స్​లర్ ఎంజెలా మెర్కెల్ బహిరంగంగానే ఈ చర్యను తప్పుబట్టారు. టీకా ఉత్పత్తికి ఈ నిర్ణయం తీవ్రమైన ఇబ్బందులను తీసుకొస్తుందంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీఓలో ఈ ప్రతిపాదన గట్టెక్కే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి: టీకాల 'పేటెంట్ రద్దు'.. ఇంత వివాదం ఎందుకు?

అదే ప్రధానం!

ఈ ప్రకటన వెలుపడిన సమయంపై పలువురు పెదవి విరుస్తున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీయకూడదంటూ అమెరికా టీకా తయారీదారులు బైడెన్ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్న సమయంలోనే ఇలా చేయడం పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారు.

అయితే బైడెన్​కు ఇవేవీ ప్రధానం కాదని- డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల ఏకపక్ష జాతీయవాద విధానం నుంచి అమెరికాను బయటకు తీసుకొచ్చి, ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో తిరిగి నిలబెట్టాలన్నదే ఆయన అభిమతమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

చైనా చేతుల్లోకి సాంకేతికత!

సంబంధిత పక్షాలతో అమెరికా వర్తక ప్రతినిధి కేథరీన్ థాయ్ 20కి పైగా సమావేశాలు నిర్వహించే ఈ నిర్ణయానికి వచ్చారని అధికారులు చెప్తున్నా- ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన వాణిజ్య మంత్రి గీనా రైమోండోను తుది సమావేశానికి ఆహ్వానించలేదన్న వార్తలు చర్చనీయంగా మారాయి. ఔషధ తయారీ రంగం విషయంలో భవిష్యత్తులో పెట్టుబడులను ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వర్తక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పర్యవసానంగా కీలకమైన అమెరికా సాంకేతికత చైనా చేతిలోకి వెళ్తే ప్రమాదం ఉందని రిపబ్లికన్ చట్టసభ్యులు ఆరోపిస్తున్నారు.

ముడి పదార్థాల కొరత వల్లే టీకా ఉత్పత్తిలో అవాంతరాలు ఎదురవుతున్నాయని వ్యాక్సిన్ తయారీదారులు అంటున్నారు. ఒక్క ఫైజర్ టీకా తయారీకి 200కు పైగా ముడి పదార్థాలు అవసరమవుతాయి. వీటికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగింది. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తే.. మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు.

ఈ పరిణామాల మధ్య బైడెన్​ నిర్ణయం ఏమేరకు ఫలితాల్ని ఇస్తుందన్నది సర్వత్తా ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి: 'టీకాల ఎగుమతిపై అమెరికా చర్యలు చేపట్టాలి'

Last Updated : May 8, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.