డొనాల్డ్ ట్రంప్‌పై ఘన విజయం సాధించి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌కు(joe biden news today ).. అనతికాలంలోనే ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఆయన ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో.. ఆయన పాలనపై ప్రజలకు నమ్మకం పోతోందని ప్యూ పరిశోధన కేంద్రం తెలిపింది. గడిచిన రెండు నెలల్లో బైడెన్‌కు ప్రజాదరణ భారీగా తగ్గినట్లు పేర్కొంది. అధ్యక్షుడిగా బైడెన్(biden news) సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారని 44 మంది చెప్పగా.. 53 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్యూ పరిశోధన కేంద్రం నివేదిక తాజా గణాంకాల(pew research center report) ప్రకారం.. జులై తర్వాత బైడెన్ రేటింగ్ భారీగా పడిపోయింది. జులై నెలలో 55 శాతం మంది బైడెన్ పాలనకు మద్దతు పలకగా.. 43 శాతం మంది వ్యతిరేకించారు. మార్చి నెల నుంచి దాదాపు 11 పాయింట్లు కోల్పోయారు.
మార్చితో పోల్చితే.. ప్రజల శ్రేయస్సు కోసం బైడెన్ కృషి చేస్తున్నారని చాలా తక్కువ మంది చెప్పటం గమనార్హం. మరోవైపు.. ఆయన తన మాటపై నిలబడతారని, నిజాయితీగా, ఇతరులకు రోల్‌మోడల్‌గా ఉంటారని అతికొద్ది మంది మాత్రమే చెప్పారు.
కరోనా కట్టడిలో సానుకూలమే కానీ..
కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో బైడెన్ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని 51 శాతం మంది చెప్పారు. అయితే.. అది మార్చి (65శాతం)తో పోల్చితే.. చాలా తక్కువ. అలాగే.. ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, ఇమ్మిగ్రేషన్ విధానాల నిర్వహణలోనూ బైడెన్‌పై అసంతృప్తి వ్యక్త పరిచారు అక్కడి ప్రజలు.
మరోవైపు.. దేశాన్ని ఏకతాటిపైకి తేవటంలోనూ బైడెన్ విఫలమైనట్లు ప్రజలు భావిస్తున్నారు. మూడింట ఒకవంతు(34శాతం) మాత్రమే ఈ విషయంలో బైడెన్‌కు ఓటు వేశారు. అది మార్చితో పోల్చితే.. 14 శాతం మేర క్షీణించింది. అలాగే.. ఆయన నమ్మిన విషయాలకు కట్టుబడి ఉంటారని 60 శాతం మందే చెప్పారు. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకుంటారని 54 శాతం మంది చెప్పారు. ఈ విషయాల్లో ఆరు నెలల క్రితం 66 శాతం, 62 శాతం ఆదరణ లభించింది.
ఇదీ చూడండి: బైడెన్‌పై అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తి