ETV Bharat / international

బైడెన్​ ప్రమాణ స్వీకార థీమ్​.. 'యునైటెడ్​ అమెరికా' - ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్

అమెరికా సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి.. దేశ ఉజ్వల భవిష్యత్తును ప్రతిబింబించేలా బైడెన్​ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురల్ కమిటీ తెలిపింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి థీమ్​గా 'యునైటెడ్​ అమెరికా'ను ఎంచుకుంది. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్‌కు ఒక ప్రకటనను విడుదల చేసింది.

Biden inauguration theme America United
బైడెన్​ ప్రమాణ స్వీకారం రోజున ఏం చేస్తారంటే?
author img

By

Published : Jan 12, 2021, 5:13 AM IST

ఈ నెల 20న జరగనున్న అధ్యక్షుడి ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయితే బైడెన్​ ప్రమాణస్వీకారం చేయనున్న ఈ కార్యక్రమానికి థీమ్​గా 'అమెరికా యునైటెడ్​'ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించింది ప్రెసిడెన్షియల్​ ఇనాగ్యురల్​ కమిటీ. అమెరికా ఆత్మను పునరుద్ధరించి, దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, భవిష్యత్తుకు బాట వేయాలన్న బైడెన్​ లక్ష్యాన్ని ఈ థీమ్​ ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

అమెరికా ఐకమత్యంతో ఉండాలని బైడెన్ ఎప్పుడూ ​ చెబుతూనే ఉంటారు. అయితే ఇటీవల జరిగిన క్యాపిటల్​ హింసతో ఈ నినాదానికి మరింత ప్రాముఖ్యం పెరిగింది.

సైనికులకు నివాళి..

అమెరికా యునైటెడ్​లో భాగంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో కలసి.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పిస్తారు బైడెన్​​. ఆ సమయంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్​లు అక్కడే ఉంటారు. ఫలితంగా అధికారిక కార్యక్రమాలన్నీ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని కమిటీ తెలిపింది.

స్ఫూర్తి నింపేలా..

తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బైడెన్.. ఇంటి వద్దే ఉంటూ వీక్షించాలని కోరారు. అమెరికా ఐక్యతకు చిహ్నంగా దేశవ్యాప్తంగా 1,91,500 జెండాలు ఏర్పాటు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రారంభోత్సవ పరేడ్ ఇతర సంప్రదాయ కార్యక్రమాలు వర్చువల్ ఫార్మాట్​లో జరుగుతాయి.

సరికొత్త అధ్యాయం..

బైడెన్ ప్రమాణ స్వీకారానికి రాకుండా ట్రంప్ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని.. అయితే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరవ్వడం శుభపరిణామమని కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడింది. మరోవైపు ట్రంప్ అనుకూల నిరసనలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ చదవండి: క్యాపిటల్​పై దాడిని ఖండిస్తూ దౌత్య అధికారుల తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.