ETV Bharat / international

లక్ష్యం సాధించే వరకు ఆపరేషన్​ ఆగదు: నెతన్యాహు - ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

తమ లక్ష్యాన్ని సాధించేంత వరకు గాజాపై దాడులను ఆపబోమని ఇజ్రాయెల్​ నెతన్యాహు తేల్చిచెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ నెతన్యాహుతో ఫోన్​లో మాట్లాడిన కొద్ది గంటలకే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

biden netanyahu
బైడెన్ నెతన్యాహు
author img

By

Published : May 19, 2021, 9:43 PM IST

Updated : May 19, 2021, 10:45 PM IST

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనపడటం లేదు. తాజాగా.. ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుకు ఫోన్​ చేసిన బైడెన్​.. కాల్పుల విరమణకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. అయితే ఎవరెన్ని చెప్పినా, లక్ష్యాన్ని సాధించేంతవరకు తమ "ఆపరేషన్​" ఆగబోదని నెతన్యాహు తేల్చిచెప్పడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్​- అమెరికా బహిరంగంగా విభేదించడం ఇదే తొలిసారి.

బైడెన్​ ఫోన్​..

నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ఫోన్​ చేశారు​. పాలస్తీనాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక రోజు వ్యవధిలో.. పరిస్థితిని అదుపు చేసే విధంగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు​. ఇరు దేశాలు కాల్పుల విరమణ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గత పది రోజులుగా పరస్పర దాడులతో పాలస్తీనా-ఇజ్రాయెల్​ దేశాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా గాజా ప్రాంతం విలవిలలాడుతోంది. పాలస్తీనా నిరసనకారులు- ఇజ్రాయెల్​ పోలీసుల మధ్య మొదలైన ఘర్షణ.. ఇరు దేశాలను యుద్ధం అంచు వరకు తీసుకెళ్లాయి.

గాజాలో.. దాడులు, ఘర్షణల్లో ఇప్పటివరకు 200మంది మరణించారు. అయితే మిత్ర దేశమైన ఇజ్రాయెల్​కు ఇంతకాలం మద్దతిస్తూ వచ్చారు బైడెన్​. ఇన్నిరోజుల్లో ఎన్నడూ కాల్పుల విరమణ కోసం ప్రత్యక్షంగా ఒత్తిడి పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. పరిస్థితిని అదుపుచేయాలని బైడెన్​ మీద కూడా ఒత్తిడి పెరుగుతోందని.. అందుకే చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

'ఆపరేషన్​ ఆగదు..'

బైడెన్​ ఫోన్​ చేసిన కొద్దిసేపటికి నెతన్యాహు కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. 'అమెరికా అధ్యక్షుడు మద్దతును మేము ప్రశంసిస్తున్నాం. కానీ ఇజ్రాయెల్​లో శాంతి, భద్రతను నెలకొల్పేందుకు ముందుకు సాగుతాం' అని అధికారిక ప్రకటనలో నెతన్యాహు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్​ దాడులు.. విద్యా సంస్థలు ధ్వంసం

గాజాపై దాడి- ఖండించిన అంతర్జాతీయ సమాజం

'ఇజ్రాయెల్-గాజా' కాల్పుల విరమణకు బైడెన్ మద్దతు

Last Updated : May 19, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.