ట్రంప్ తనకు ఎంతో ఔదార్యంతో లేఖ రాశారని నూతన అధ్యక్షుడు జో బైెడెన్ తెలపగా.. అంతటా ఆసక్తి నెలకొంది. ఈ లేఖ విషయమై ట్రంప్‌తో అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పుడు మాట్లాడుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే.. దీనిపై ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవని శ్వేతసౌధం తెలిపింది. ఈ విషయంలో ట్రంప్‌కు బైడెన్ ఫోన్ చేసి మాట్లాడడం గురించి తాను ఏమీ చెప్పలేనని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు. ఈ లేఖ వ్యవహారంలో బైడెన్ గౌరవపూర్వకంగా స్పందించాలని భావిస్తున్నారని స్పష్టం చేశారు.
అసలేంటీ లేఖ..?
పదవీకాలం మగిసిన అధ్యక్షుడు.. నూతన అధ్యక్షుడికి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓవల్ కార్యాలయంలో లేక విడిచి వెళ్లం ఆనవాయితీ. పాలన పగ్గాల అప్పగింత సంప్రదాయాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన ట్రంప్.. లేఖను విడిచి వెళ్లే సంప్రదాయాన్ని మాత్రం పాటించారు. ఇందులో డొనాల్డ్ ఏం రాసి ఉంటారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొనగా.. విలేకరులు ఈ విషయమై బైడెన్‌ను అడిగారు. ట్రంప్ తనకు రాసిన లేఖ ఎంతో ఔదార్యంగా ఉందని ఆయన బదులిచ్చారు. ఈ లేఖ పూర్తిగా ప్రైవేటు అంశం. ట్రంప్‌తో మాట్లాడిన తర్వాతే దీనిపై స్పందిస్తా' అని బైడెన్ చెప్పారు.
ఇదీ చూడండి:'భారత్, అమెరికా బంధం.. 'కమల'తో మరింత దృఢం'