ETV Bharat / international

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇక ట్రంప్​, బిడెన్ ఢీ - Bernie Sanders

ఈ ఏడాది నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ను ఢీకొట్టనున్నారు జో బిడెన్​. డెమోక్రాటిక్​ పార్టీ తరఫున నామినేషన్​కు అవసరమైన ప్రతినిధుల మద్దతును ప్రాథమిక ఎన్నికల్లో పొందారు. ఏడు రాష్ట్రాల్లో ఓటింగ్​ పూర్తయ్యేసరికి 1995 ఓట్లు సాధించారు.

Biden formally clinches Democratic presidential nomination
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ను ఢీకొట్టనున్న బిడెన్​
author img

By

Published : Jun 6, 2020, 12:35 PM IST

డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని సాధించారు జో బిడెన్​. కరోనా వ్యాప్తి, ఆర్థిక సంక్షోభం, అశాంతి వంటి కీలక అంశాలే ప్రధాన అజెండాగా నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్​ను ఢీ కొట్టనున్నారు. అత్యంత ప్రతిభావంతులైన డెమోక్రాటిక్​ అభ్యుర్థులతో పోటీ పడి ఈ అర్హత సాధించినందుకు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు బిడెన్​. పార్టీ ఐకమత్యంతో ఈ ఎన్నికల్లో ముందుకుసాగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.

అధ్యక్ష పదవి నామినేషన్​కు 1991 మంది ప్రతినిధుల మద్దతు అవసరం కాగా, ఏడు రాష్ట్రాలు ఒక జిల్లాలో ప్రాథమిక ఎన్నికలు ముగిసేసరికి 1995 మంది మద్దతు కైవసం చేసుకున్నారు బిడెన్​. ఈ ఎన్నికలు.. ఫలితాలు మెయిల్​ ఓట్లు ఎక్కువ ఉన్న కారణంగా శుక్రవారం రాత్రి పూర్తిగా వెలువడ్డాయి. ఇంకా ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. డెమోక్రాట్ల మరో అభ్యర్థి బెర్నీ సాండర్స్​ ఎప్రిల్​లోనే రేసు నుంచి వైదొలిగారు.

'ప్రస్తుతం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం, విభజన రాజకీయాలు సమస్యకు పరిష్కారం కాదు. ప్రస్తుతం దేశం ఓ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది' అని బిడెన్ అన్నారు.

ఒబామా హయాంలో అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్నారు 77 ఏళ్ల బిడెన్. 36 ఏళ్ల పాటు సెనేట్​లో ఉన్నారు. నల్లజాతీయుల నుంచి ఆయనకు భారీగా మద్దుతు ఉంది.

ఇటీవల ఫాక్స్​ న్యూస్ నిర్వహించిన ఓ సర్వేలో 14 శాతం మంది నల్లజాతీయులు మాత్రమే ట్రంప్​ వైపు మొగ్గు చూపగా, 75 శాతం మంది బిడెన్​కే అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా జార్జి ఫ్లాయిడ్​ మృతికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. వారికి సరైన ప్రాధాన్యం ఇస్తే బిడెన్​కు కలిసివచ్చే అవకాశాలు ఎక్కువే. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించారు బిడెన్. ఆ అవకాశం నల్లజాతీయులకు ఇవ్వాలని ఆయనపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.