కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికా ప్రజలను ఆదుకునేందుకు జో బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల సాయం అమలు దిశగా ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అగ్రరాజ్య సెనేట్ ఆమోదం తెలిపింది. సెనేట్‌లోని రిపబ్లికన్ సభ్యులందరూ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. 50-49 తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చేవారం కాంగ్రెస్ ఆమోదం కోసం పంపిస్తారు. ఆ తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ బిల్లుపై సంతకం చేస్తారు. ఇది కార్యరూపం దాలిస్తే అమెరికా పౌరులకు ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు చేయడం సహా కొవిడ్‌పై పోరాటానికి నిధులను వెచ్చిస్తారు.
బిల్లు ఆమోదంపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికా చాలా కాలం నష్టపోయిందని, అందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు.
ఇదీ చూడండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్ ప్రభుత్వం