అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ తన బృందంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత.. బాధ్యతలు నిర్వహించే వైట్ హౌస్ నూతన ప్రెస్ బృందంలో మొత్తం సీనియర్ మహిళలకే చోటు కల్పించారు. ట్రంప్ బృందంలో చాలా కాలంగా పని చేస్తోన్న జెన్ సాకి కమ్యూనికేషన్స్ సెక్రెటరీగా నియమితులయ్యారు.
![all-female senior White House press team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9709582_zxc.jpg)
కేట్ బెడింగ్.. శ్వేతసౌధ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. బెడింగ్, సాకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బృందంలోనూ పని చేయడం గమనార్హం.
అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న కరీన్ జీన్ పియరీ వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరిగా ఉండనున్నారు.
ఇదీ చూడండి:విస్కాన్సిన్లో రీకౌంటింగ్ పూర్తి.. బైడెన్‌దే విజయం