శ్వేతసౌధానికి సంబంధించిన 'ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ'కి తన బృందాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. ఇందులో భారత సంతతి ఈషా షాకు సీనియర్ పదవి దక్కింది.
ఈషా కశ్మీర్లో జన్మించారు. లూసియానాలో పెరిగారు. డిజిటల్ బృందంలో షాను 'పార్ట్నర్షిప్స్ మేనేజర్'గా నియమించారు బైడెన్. అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్-హారిస్ ప్రచారాలకు కూడా షా ఇదే బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ విశ్వవిద్యాలయంలో అడ్వాన్సడ్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఈ డిజిటల్ బృందానికి రాబ్ ఫ్లాహెర్టి నేతృత్వం వహించనున్నారు. మిగిలిన వారిలో బ్రెండన్ కోహెన్(ప్లాట్ఫార్మ్ మేనేజర్), మహా గాండోర్(డిజిటల్ పార్ట్నర్షిప్స్ మేనేజర్) తదితరులు ఉన్నారు. బైడెన్ అధికార బదిలీ యంత్రాంగం ఈ వివరాలను వెల్లడించింది.
ఇదీ చూడండి:- పట్టు వీడిన ట్రంప్- కొవిడ్ ప్యాకేజీపై సంతకం